ప్రతి మండల కేంద్రంలో కోల్డు స్టోరేజ్‌

 


కర్నూలు: అన్నదాతలను ఆదుకోవడమే లక్ష్యంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరో హామీ ఇచ్చారు. ప్రతి మండల కేంద్రంలో కోల్డు స్టోరేజ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని వైయస్‌ జగన్‌ రైతులకు హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం కర్నూలు జిల్లా కోడుమూరు శివారులోని ప‌త్తిపంట‌ను వైయ‌స్ జ‌గ‌న్ ప‌రిశీలించారు. పంట‌ల దుస్థితిపై ఆరా తీశారు. నకిలీ విత్తనాలతో మోసపోతున్నామని, కనీసం పెట్టుబడులు కూడా చేతికి అందడం లేదని రైతులు వాపోయారు. పంట దిగుబడులు తగ్గిపోవడంతో కౌలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. పత్తికి గిట్టుబాటు ధర లేదని జననేతకు ఫిర్యాదు చేశారు. లింగాక‌ర్శ‌న బుట్ట‌లు స‌బ్సిడీలో ఇస్తే ప‌త్తికి తెగుళ్లు రావు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర రూ.4320 ఉండ‌గా, ఈ ధ‌ర‌కు కొనుక్కునే ప‌రిస్థితి లేద‌ని రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  రైతుల సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి మండల కేంద్రంలో కోల్డు స్టోరేజ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మీకు ఎప్పుడు పంట అమ్ముకోవాలంటే అప్పుడు అమ్ముకునేలా వీలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతులకు ఖరీఫ్‌ పంట సాగుకు ముందుగానే ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా రూ.12500 ఇస్తామని హామీ ఇచ్చారు. పంట పండక ముందే మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పారు. వైయస్‌ జగన్‌ హామీతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Back to Top