అలుపెరగని పాదయాత్ర- వైయ‌స్ జ‌గ‌న్‌కు అడుగడుగునా బ్రహ్మరథం
- చిత్తూరు జిల్లాలో విశేష స్పంద‌న‌

చిత్తూరు: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది. ప్ర‌జ‌ల ప‌క్ష‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని భావించిన జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ అలుపెర‌గ‌ని పాద‌యాత్ర చేస్తూ జ‌నంతో మ‌మేక‌మ‌వుతున్నారు. అడుగులు అప్రతిహతంగా పడుతున్నాయి. విమర్శలు పదునెక్కుతున్నాయి. నవరత్న పథకాలు మరింత రాటుదేలుతున్నాయి. సామాన్యుడిలో సామాన్యుడిగా కలసిపోతూ వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సాగిస్తున్న ప్రజాసంకల్ప యాత్ర సగటుజీవి హృదయాన్ని గెల్చుకుని విజయపథంలో పయనిస్తోంది. వ్యంగ్యోక్తులు..వెక్కిరింపుల అడ్డుగోడల్ని చీల్చుకుంటూ ప్రజల పక్షాన సాగిస్తున్న అలుపెరగని పాదయాత్ర ఇవాళ 53వ రోజు పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌య‌వంతంగా సాగుతోంది. దీక్షాసంకల్పంతో..పట్టుదలతో చేపట్టిన ఈ యాత్ర జిల్లాలో అడుగుపెట్టింది మొదలు జనం నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. నాలుగేళ్లుగా టీడీపీ సర్కారు హయాంలో తాము పడుతున్న వేదనను విపక్షనేతకు వివరిస్తున్నారు. తమ అభిమాన నేత వైఎస్‌ జగన్‌ నడిచొచ్చే దారిలో ఆ పువ్వులు పరుస్తున్నారు. మహిళలు, రైతులు, యువకులు, ఉద్యోగులు భారీఎత్తున తరలివచ్చి వైయ‌స్‌ జగన్‌కు త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. నిత్యం వేలాదిమంది వైయ‌స్‌ జగన్‌తో పాదం క‌లిపి క‌దం తొక్కుతున్నారు ‘జగనన్నా రావాలి... కావాలి జగనన్నా’ అని నినదిస్తూ ముందుకు కదులుతున్నారు. త‌న‌ను క‌లిసిప  ప్రతి ఒక్కరికి ధైర్యం చెబుతూ, భ‌రోసా క‌ల్పిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు.  

కదిలొచ్చిన కుప్పం
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌త్యేక వాహ‌నాల్లో ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా త‌ర‌లివ‌చ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 52వ రోజు గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరు శాసనసభా నియోజకవర్గంలోని పాలమంద పెద్దూరు వద్ద పాదయాత్ర సాగిస్తున్న వైయ‌స్‌ జగన్‌ను కుప్పం నుంచి వేలాదిగా తరలి వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు కలుసుకున్నారు. 170 కిలోమీటర్లకు పైగా దూరం నుంచి తనపై అభిమానంతో తరలి వచ్చారు.  పాదయాత్ర ముగిశాక, ఆగస్టులోనో.. సెప్టెంబర్‌లోనో బస్సు యాత్ర మొదలవుతుంది. నేను ఏఏ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయలేక పోయానో వాటన్నింటిలో బస్సు యాత్ర చేస్తాను. అపుడు కుప్పంకు వచ్చి నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ తిరుగుతా’’నని వైయ‌స్‌ జగన్‌ స్పష్టం చేశారు. దీంతో కుప్పం ప్ర‌.జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 

Back to Top