‘వంద‌’నం..అభినంద‌నం

-  ప్రజా సంకల్ప యాత్ర @ 100 కిలోమీటర్లు
- ఉత్సాహంగా సాగుతున్న వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
- అడుగ‌డుగునా జ‌న నీరాజ‌నం

కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర వంద కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ నెల 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన పాదయాత్ర వైయస్‌ఆర్‌ జిల్లాలో ఏడు రోజుల పాటు సాగింది. మంగళవారం ఉదయం కర్నూలు జిల్లాలో ప్రవేశించిన యాత్ర మధ్యాహ్నంకు వంద కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని అభినందించారు. ఈ యాత్ర ఇచ్చాపురం వ రకు 3 వేల కిలోమీటర్ల మేర సాగనుంది. దాదాపు 7 నెలల పాటు వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. అలాగే 2019 ఎన్నికలకు సంబంధించిన పార్టీ మ్యానిఫెస్టోను ప్రజల మధ్యనే రూపొందించనున్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రలో వేలాది మంది పాల్గొంటున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ప్రజలు తమ బాధలు చెప్పుకుంటూ, చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో మోసపోయామని వైయస్‌ జగన్‌ వద్ద వాపోతున్నారు.

ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైయ‌స్‌ జగన్‌ను కలిసేందుకు మహిళలు పోటెత్తారు.  తమ సమస్యలు చెప్పుకునేందుకు ఉత్సాహం చూపించారు.  పొలం పనులు చేసుకుంటున్న  మహిళలు సైతం రాజన్న బిడ్డ రాకను తెలుసుకుని కలిసేందుకు పరుగులు తీస్తున్నారు. గ్రామాల్లో  బెల్ట్‌ షాపులను అరికట్టాలని కోరుతున్నారు.  మద్యం దుకాణాల వల్ల తమ  కుటుంబాలు నాశనమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన వైయ‌స్‌ జగన్‌....సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మూడు దశల్లో సంపూర్ణ మద్యనిషేధం అమలు అవుతుందని తెలిపారు. అశేషంగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలతో.... ఆ ప్రాంతమంతా జనసంద్రాన్ని తలపిస్తొంది. ప్రజాసంకల్పయాత్రలో ఉన్నఆయనను కలిసేందుకు అన్ని వర్గాల ప్రజలు పోటెత్తుతున్నారు.  యాత్ర‌ను కొన‌సాగిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌తి ఒక్క‌రు వంద‌నం, అభినంద‌నం తెలుపుతున్నారు.

Back to Top