ఊరూరా భరోసా

వైయస్‌ఆర్‌ జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఊరూరా ప్రజలకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఏ ఊరికి వెళ్లినా కూడా చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ చేస్తామని దగా చేశారని రైతులు, డ్వాక్రా మహిళలు వైయస్‌ జగన్‌ ఎదుట వాపోయారు. వైయస్‌ జగన్‌ నాలుగు రోజు పాదయాత ఊరుటూరు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి పెద్దన్నపాడుకు చేరుకున్న వైయస్‌ జగన్‌కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా  రైతులు, యువకులు తమ సమస్యలు జననేతకు చెప్పుకున్నారు. ఏపీలో ఉద్యోగాలు లేక బెంగళూరుకు వెళ్తున్నామని నిరుద్యోగులు చెప్పారు. రెండు విడతలు రుణమాఫీ డబ్బులు ఇచ్చారని, మూడో విడతకు సంబంధించి 72 గంటల్లో  బ్యాంకు ఖాతాల్లో జమా అవుతాయని చెప్పారని, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదని ఫిర్యాదు చేశారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని, ఇదేం ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. రైతుల పరిస్థితి దయానీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పీజీ చదివినా ఇక్కడ ఉద్యోగాలు లేక బెంగళూరులో కూలీ పనులు చేసుకుంటున్నామని మరికొంత మంది నిరుద్యోగులు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వీరి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ త్వరలోనే మంచి రోజులు వస్తాయని అందరికి భరోసా కల్పించారు.

Back to Top