అన్న‌కు అక్ష‌ర రూపంహైదరాబాద్‌ : ప్రజా సమస్యలను తెలుసుకుంటూ..  వారికి భరోసా కల్పిస్తూ.. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సాగిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర విజ‌య‌వంతంగా సాగుతోంది. గ‌తేడాది న‌వంబ‌ర్ 6న ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది.  వైయ‌స్‌ జగన్‌ చేస్తున్న యాత్ర ఇటీవలే చింతపల్లి క్రాస్‌ వద్ద 2400 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. నాలుగేళ్ల టీడీపీ ప్రజాకంటక పాలన నుంచి విముక్తి కల్పించేందుకు వచ్చిన నవ‘రత్నం’ను చూసి కోనసీమ పల్లెలు కదులుతున్నాయి. ఇప్పటి వరకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర  చేసిన నియోజవర్గ పేర్లతో అన్నా బత్తుని కిషోర్‌ అనే యువకుడు జననేత బొమ్మ గీసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. జననేతతో రూపుదిద్దుకున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. వైయ‌స్ఆర్‌సీపీ అభిమానులు విఫ‌రీతంగా షేర్లు చేస్తూ, లైక్‌లు కొడుతూ అభిమానాన్ని చాటుతున్నారు. 
Back to Top