అంబేద్కర్‌కు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి


కర్నూలు : రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా దాదా సాహెబ్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు.  కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రామకృష్ణాపురం నుంచి 18వ రోజు ప్రజాసంకల్పయాత్ర ఆదివారం ప్రారంభమైంది. ఈ సంద‌ర్భంగా అంబేద్క‌ర్ సేవ‌ల‌ను ప్ర‌తిప‌క్ష నేత కొనియాడారు. పాద‌యాత్ర‌లో భాగంగా రామకృష్ణాపురంలో ముస్లిం మత పెద్దలు వైయ‌స్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా అధికారంలోకి మసీదుల నిర్వహణకు రూ. 15 వేలు, ఇమామ్‌లకు రూ. 10 వేలు, మౌజమ్‌లకు రూ. 5 వేల వేతనం ఇస్తామని వైయ‌స్‌ జగన్‌ హామీ ఇచ్చారు. వైయ‌స్‌ జగన్‌ హామీపై ముస్లిం మత పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ ఎర్రగుడి గ్రామానికి కొద్ది సేప‌టి క్రిత‌మే చేరుకున్నారు. పాదయాత్ర కోడుమూరు నియోజకవర్గం గోరంట్ల చేరుకున్న తర్వాత బీసీ సంఘాలతో వైయ‌స్‌ జగన్‌ సమావేశం కానున్నారు. అక్కడి నుంచి వెంకటగిరికి చేరుకుంటారు. వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు జిల్లాలో విశేష స్పంద‌న ల‌భిస్తోంది. దారిపొడువునా ప్ర‌జ‌లు త‌మ బాధ‌లు ప్ర‌తిప‌క్ష నేత‌కు చెప్పుకుంటున్నారు. అంద‌రి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా వింటున్న వైయ‌స్ జ‌గ‌న్ ఏడాది పాటు ఓపిక ప‌ట్టండి మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పిస్తున్నారు.


Back to Top