జాతిపితకు ఘన నివాళి

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు . కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా హనుమాన్ జంక్షన్ లో వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్  మహాత్మా చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అధినేతతో పాటు పార్టీ నేతలు జాతిపితకు నివాళులర్పించి స్మరించుకున్నారు. 

 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు గాంధీజీకి నివాళుల‌ర్పించారు. ఒంగోలు న‌గ‌రంలోని పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన వేడుక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి మ‌హాత్ముడి చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి  ఘనంగా నివాళులర్పించారు. ఓ మానవతామూర్తిని, మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయిన రోజు ఇదిని గుర్తు చేశారు. 

గాంధీజీ వర్దంతి సందర్బంగా విశాఖపట్నం జీవీఎంసీ  దగ్గర జాతిపిత విగ్ర‌హానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమర్నాథ్, పార్టీ నాయ‌కులు పూల‌మాల‌లు వేసి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. చెరగని చిరునవ్వు. ప్రశాంతమైన ముఖం. మృదువైన మాటలు. వ్యక్తిత్వాన్ని స్వయంగా పెంపొందించుకోవడం.. ఇవి ఆయనలోని ప్రత్యేక లక్షణాలని గుడివాడ అమ‌ర్నాథ్ అన్నారు.


Back to Top