తుని నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
తూర్పు గోదావ‌రి: వైయ‌స్ఆర్‌ సీపీ అధ్యక్షులు  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర తూర్పు గోదావ‌రి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఏ పల్లెకు వెళ్లినా జనమే జనం. జననేత అడుగు పెట్టాక జనజాతరను తలపిస్తున్నాయి.  వ్యవసాయ కూలీలు, రైతులు, వికలాంగులు, మహిళలు, విద్యార్థినీ విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాలూ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో అడుగులు వేస్తున్నారు. కిలోమీటర్ల మేర అభిమాన నేత వెంట నడుస్తున్నారు.అలుపెరగని యోధుడికి సంఘీభావం తెలుపుతున్నారు. తమ బాధలు చెప్పుకుని ఉపశమనం పొందుతున్నారు. ప్రజాసంకల్ప యాత్ర ఆద్యంతం తండోప తండాలుగా జనం తరలిరావడంతో రహదారులు జనదారులుగా మారిపోతున్నాయి. పాదయాత్ర సాగే గ్రామాల్లో వినూత్న రీతిలో అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. పాదయాత్రికుడి రాకను పండగగా జరుపుకొంటున్నారు. ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర తుని నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించింది.  శనివారం ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో  కొనసాగనుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కష్టాల్లో ఉన్న వారికి భరోసానిస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్న పాదయాత్ర ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం డీజేపురం నుంచి ప్రారంభం కానుంది. తుని నియోజకవర్గంలోని కొత్తవెలంపేట, సీతయ్యపేట, లోవకొత్తూరు, తల్లూరు జంక్షన్, జగన్నాథగిరి, తునిలో పాదయాత్ర సాగుతుంది. సాయంత్రం తునిలో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లో జననేత వైయ‌స్  జగన్‌మోహన్‌రెడ్డి  ప్రసంగించనున్నారు.
Back to Top