జనం గుండెలో జననేత..!

ఊరువాడ కదిలే..దీక్షకై సాగే..!
మదినిండా జగన్ నామస్మరణమే..!

గుంటూరుః ప్రత్యేకహోదా సాధన కోసం ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్ చేపట్టిన దీక్ష  నాల్గవ రోజుకు చేరుకుంది. రోజురోజుకు ఉద్యమం తీవ్రతరం అవుతోంది. ఊరువాడ అంతా ఏకమై వైఎస్ జగన్ దీక్షకు కదం తొక్కుతున్నారు. పెద్ద ఎత్తున దీక్షా శిబిరానికి చేరుకొని వైఎస్ జగన్ కు తమ మద్దతు తెలుపుతున్నారు. తండోపతండాలుగా తరలివస్తున్న జనంతో గుంటూరు నల్లపాడు రోడ్డు కిక్కిరిసిపోతుంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు దీక్షాస్థలిలో వైఎస్ జగన్ కు తోడుగా వెన్నంటే ఉంటూ ప్రత్యేకహోదా ఆవశ్యకతను చాటిచెబుతున్నారు.

చిరునవ్వుతో...!
ప్రత్యేకహోదా ఆకాంక్షను వ్యక్తపరుస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు వైఎస్ జగన్ కోసం గొంతెత్తి నినదిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలతోపాటు విద్యార్థిసంఘాలు, ప్రజాసంఘాల నాయకులు , ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, శ్రామికులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులు సహా యావత్  ప్రజానీకం వైఎస్ జగన్ కు అండగా నిలుస్తున్నారు.  దీక్షాస్థలికి వచ్చిన ప్రతి ఒక్కరినీ తన చిరునవ్వుతో వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరిస్తున్నారు.చేయి చేయి కలిపి  వైఎస్ జగన్ అభివాదం చేస్తున్న తీరు అక్కడకు వచ్చిన వారిని అమితంగా ఆకట్టుకుంటోంది.  

జననేత కోసం పూజలు..!
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల ప్రజలు జననేత కోసం గళమెత్తున్నారు.  ఆంధ్రుల హక్కు ప్రత్యేకహోదా..వైఎస్ జగన్ తోనే సాధ్యమని నినదిస్తున్నారు. వైఎస్ జగన్ కు బాసటగా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల్లో ర్యాలీలు, ధర్నాలు, రిలే దీక్షలు చేస్తున్నారు.  వైఎస్ జగన్ దీక్ష విజయవంతం కావాలని కోరుతూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వైఎస్ జగన్ ఆరోగ్యం బాగుండాలి, రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావాలని కొబ్బరికాయలు కొట్టి మొక్కుకుంటున్నారు.
Back to Top