ప్రత్యేక హోదాపై బాబు పూటకో రంగు
– ప్యాకేజీకి ఒప్పుకొని..హోదాను చంద్రబాబు నీరుగార్చారు
– చంద్రబాబు తీరువల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు
– ఢిల్లీలో హోదా పోరాటం కోసం వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులన్నీ బయలుదేరాయి
– మార్చి 21న పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం
– అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే ఏప్రిల్‌ 6న ఎంపీల రాజీనామా
– మనం అధికారంలోకి రాగానే దొనకొండ అభివృద్ధికి 100 రోజుల్లో చర్యలు
– సాగర్‌ నీటి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోంది
–వెలుగొండ ప్రాజెక్టు డీపీఆర్‌ను చంద్రబాబు చెత్తబుట్టలో పడేశారు
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా?
– బాబొస్తే జాబొస్తుందన్నారు..ఇప్పుడు ఉన్న జాబులు పోతున్నాయి
– ప్రకాశం జిల్లా నిరుద్యోగులు పొరుగు ప్రాంతాలకు వలసపోతున్నారు
– చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు..మోసాలే
– వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే చదువుల విప్లవం

ప్రకాశం: చంద్రబాబు తీరు వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలన్న పెద్ద మనిషి  ప్యాకేజీ కోసం హోదాను అమ్ముకున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఘట్టం తుది దశకు చేరుకుందని, మార్చి 5న ఢిల్లీలో ధర్నా చేస్తామని, 21న పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని, అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే ఏప్రిల్‌ 6న వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ప్రజా సంకల్ప యాత్ర 102వ రోజు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కొనసాగింది. సాయంత్రం తాళ్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. 

చంద్రబాబు సీఎం కావడం మన ఖర్మ
రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వరుసగా కరువు నెలకొంటుందని వైయస్‌ జగన్‌ విమర్శించారు. జిల్లాకు సాగర్‌ నీరు వస్తాయోమో అని ఎదురు చూశామన్నా..సాగర్‌ నీరు మా జిల్లాకు 140 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. 15 లక్షల ఎకరాలు సాగు అవుతాయన్నా అని చెబుతున్నారు. మా ఖర్మ ఏంటో గాని చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సాగర్‌ నీరు రావడం లేదు. వరి ముఖం చూడలేకపోతున్నామని అంటున్నారు. తెలంగాణలో నీటి కేటాయింపులు లేకపోయినా వరి సాగుచేసుకుంటున్నారు. ఆ సీఎంకు ఉన్నది ఏంటీ? మన ముఖ్యమంత్రికి లేనిది ఏంటన్నా అంటున్నారు. నాలుగేళ్లుగా ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నా అని రైతులు అల్లాడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కంది కొంటామని మొసలి కన్నీరు కార్చుతున్నారు. మార్కెట్‌ యార్డుకు వెళ్తే అక్కడ కేవలం రెండు బస్తాలు మాత్రమే కొంటున్నారని రైతులు చెబుతున్నారు. రైతులు పాస్‌ బుక్‌ తీసుకెళ్తేనే కందులు కొంటున్నారు. రకరకాల కట్టడలు చేసి ఆ ధాన్యాన్ని కొంటునారు. జామాయిల్‌ వేసుకున్న రైతులు, సుబాబుల్‌ వేసుకున్న రైతులది ఇదే పరిస్థితి. నాన్నగారు సీఎం కాకముందుకు రూ.1600 సుబాబుల్‌ రేటు ఉంటే ఆ రేటును వైయస్‌ఆర్‌ రూ.4400కు తీసుకెళ్లారని చెబుతున్నారు. మళ్లీ ఇవాళ జామాయిల్‌ రూ.1800లకు అడిగే నాథుడు లేడని చెబుతున్నారు.

ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు..
నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా అని అడుగుతున్నాను. ఈ పెద్ద మనిషి పాలనలో కనీసం ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదు. రైతులు అప్పులపాలవుతున్నారు. నాగార్జున సాగర్, వెలుగొండ ప్రాజెక్టు చూస్తే బాధనిపిస్తుంది. డీపీఆర్‌ చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందే తయారైంది. నాన్నగారు ముఖ్యమంత్రి కాగానే వెలుగొండ ప్రాజెక్టుతో ప్రకాశం జ్లిల్లాను సస్యశ్యామలం చేయాలని తపన పడ్డారు. తాగునీరు, సాగునీరు ఇచ్చి న్యాయం చేసేందుకు కృష్ణా నీరు తెచ్చేందుకు శ్రీశైలం నుంచి సొరంగాలు తవ్వి నీరు తెచ్చే కార్యక్రమం చేపట్టారు. ఒక సొరంగంలో 13 కిలోమీటర్లు, మరో సొరంగంలో 9 కిలోమీటర్లు పూర్తి చేశారు. నాన్నగారి పాలనలో యుద్ధప్రాతిపాదికన పనులు జరిగాయి. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో నాలుగు కిలోమీటర్లు కూడా పనులు జరగలేదు. ఇదొక్క నిదర్శనం చాలు ప్రకాశం జిల్లాపై చంద్రబాబుకు ఏరకమైన ప్రేమ ఉందో? 

దొనకొండకు ఒక పరిశ్రమైనా తెచ్చారా?
ఇదే దొనకొండలో 50 వేల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. ఇక్కడ రాజధాని పెడితే బాగుంటుందని కేంద్ర కమిటీ సిపార్సు చేసింది. అయితే చంద్రబాబు ఈ ప్రతిపాదనలు చెత్తబుట్టలో వేశారు. దోనకొండకు పెద్ద పెద్ద పరిశ్రమలు తెస్తానని చెప్పారు. ఇంతవరకు  ఒక్క ఫ్యాకర్టీ కూడా తీసుకురాలేదు. ఇదే పెద్ద మనిషి విశాఖలో సీఐఐ సదస్సులు పెట్టి లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెబుతున్నారు. నోరు తెరిస్తే ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి అబద్ధాలు, మోసాలు పునాదులుగా రాజకీయాలు జరుగుతున్నాయి. మండ్లగూరు మండలంలో మూసి నదిపై రిజర్వాయర్, మోగలనూరు రిజర్వాయర్‌ నిర్మిస్తానన్నారు. జిల్లాలో కాస్తోకూస్తో ఉద్యోగాలు వచ్చి ఉపాధి కల్పించాలంటే రెండు పోర్టు నిర్మాణాలు పూర్తి అయి ఉంటే ఈ ప్రాంతం విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేది. ఇక్కడ ఉద్యోగాలు దొరక్క అవస్థలు పడుతున్నారన్న ఇంగిత జ్ఞానం చంద్రబాబుకు లేదు. 


హోదా ఉన్న రాష్ట్రాలకు రాయితీలు వస్తాయి..
ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబుకు తెలుసు కాబట్టే తిరుపతి సభలో ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలని మోడీ సభలో అన్నారు. ఇదే చంద్రబాబు మద్దతిచ్చిన బీజేపీ పార్టీ ఎంపీ వెంకయ్య కూడా ఆ నాడు రాజ్యసభలో పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని అన్నారు. ఆ రోజు వెంకయ్య నోట్లో నుంచి వచ్చిన మాట కాని, తిరుపతిలో చంద్రబాబు నోట్లో నుంచి వచ్చిన మాట పరిశ్రమలు పెట్టడానికి ఐదేళ్లు పడుతుందని అన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి. హోదా ఉన్న రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలు వస్తాయి. జీఎస్టీ మినహాయింపు ఉంటుంది. ఇలాంటి రాయితీలు ఉంటేనే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తారు. ఇవన్నీ తెలిసీ కూడా చంద్రబాబు దగ్గరుండి ప్రత్యేక హోదాను నీరుగార్చారు. 


ప్రజల్లో వేడి పుడితే బాబులో కదలికలు వస్తాయి..
ఎన్నికలు అయిపోయిన తరువాత చంద్రబాబు ప్లెట్‌ మార్చారు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అన్నారు. ప్యాకేజీ కావాలట. ప్యాకేజీతో మోసం చేస్తూ..హోదా అన్న మన హక్కును నీరుగార్చుతున్నారు. చంద్రబాబు కేంద్రం నుంచి తెచ్చుకున్న ప్యాకేజీ ఎంటో తెలుసా? పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలి. చంద్రబాబు కేంద్రం వద్దకు వెళ్లి పోలవరాన్ని నాకు ఇవ్వండి..నేనే కట్టుకుంటాను. నేనే సబ్‌ కాంట్రాక్టులు నా బినామీలకు కట్టబెట్టి కమీషన్లు తీసుకుంటానని పోలవరాన్ని చంద్రబాబు కేంద్రం నుంచి తీసుకున్నారు. అన్ని రేట్లు తగ్గినా కూడా చంద్రబాబు విఫరీతంగా అంచనాలు పెంచి తన మంత్రి వర్గంలోని యనమల రామకృష్ణుడి బంధువుకు పోలవరం కాంట్రాక్టులు అప్పగించారు.  ఎప్పుడైతే ప్రత్యేక హోదాపై ప్రజల్లో వేడి పుడుతుందో అప్పుడే చంద్రబాబులో కదిలికలు వస్తాయి. నిన్న చంద్రబాబు తన పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో ఏమన్నారో తెలుసా? ప్రత్యేక హోదా తాను వద్దనలేదని చంద్రబాబు అన్నారట. ఊసరవెళ్లికి ఎన్ని రంగులు మార్చవచ్చు తెలియదు కానీ, చంద్రబాబుకు బాగా తెలుసు. చంద్రబాబు స్టేట్‌మెంట్‌ చూసి నాకు ఆశ్చర్యమనిపించింది. ప్రత్యేక హోదా ఉద్యమం తుది ఘట్టానికి చేరుకుంది. ప్యాకేజీతో మోసం చేయవద్దు..హోదా మా హక్కు అని సంకేతాలు ఇచ్చాం. ఢిల్లీలో ధర్నా చేసేందుకు నిన్న ప్రత్యేక రైలు వెళ్లింది. ఇవాళ మన ప్రతినిధులు బయలుదేరారు. ఇదే చంద్రబాబు పార్టనర్‌ పవన్‌ కళ్యాణ్‌ చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టమని చెబితే ఆయన ఉద్దేశం ఏదైనా సరే..విశ్వసనీయత అనే పదానికి అర్థం తెస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమే అని ప్రకటించాను. అదే విధంగా రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడదామని చెపాం. నిన్న జరిగిన టీడీపీ పోలిట్‌బ్యూరో మీటింగ్‌లో చంద్రబాబు దశలవారీగా పోరాటం చేస్తారట. మార్చి 25న చంద్రబాబు పార్ట్‌నర్‌ చెప్పినట్లుగా పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమే. అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే పార్లమెంట్‌సమావేశాల చివరి రోజు ఏప్రిల్‌ 6న వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు. ఇది చిత్తశుద్ది అంటే. చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ఉండటం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. ఈయన కారణంగా ప్రత్యేక హోదా రావడం లేదు. ఇలాంటి వ్యక్తిని చూస్తే ఒక కథ గుర్తుకు వస్తుంది..

కెప్టెన్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడితే..
క్రికెట్‌ మ్యాచ్‌లో మంచి బౌలర్‌ కానీ, బ్యాట్స్‌మెన్‌ కానీ మ్యాచ్‌ఫిక్పింగ్‌కు పాల్పడుతుంటారు. మ్యాచ్‌ అడేటప్పుడు ఏదైనా ఒక ప్లేయర్‌ సరిగా ఆడకపోతే ఆమ్యాచ్‌కే తేడా వస్తుంది. అదే కెప్టెన్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడితే జట్టు మొత్తం రంగంలోకి దిగుతుంది. చంద్రబాబు ఇదే చేస్తున్నారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో ఓ కెప్టెన్‌ అమ్ముడబోతే సొంత జట్టు ఎలా అమ్ముడబోతుందో ఇవాళ చంద్రబాబు చూపిస్తున్నారు. 

ఏ ఒక్కరిని వదల్లేదు..
చంద్రబాబు ఎన్నికల సమయంలో ఏం చేశారో అందరికి తెలుసు. ఏ ఒక్కరిని వదిలిపెట్టMýంండా మోసం చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. రైతుల రుణాలు బేషరత్తుగా మాఫీ చేస్తానని చెప్పారు. పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను. ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా? జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ప్రతి నెల రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎప్పుడైనా చంద్రబాబు కనిపిస్తే రూ.92000 వేల పరిస్థితి ఏంటి అని అడగండి. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. పక్క రాష్ట్రాల కంటే ప్రతి లీటర్‌ మీదా రూ.7 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఎన్నికల సమయంలో పిల్లలు విఫరీతంగా తాగి చెడిపోతున్నారు. బెల్టు షాపులు తగ్గిస్తానని అన్నారు. ప్రతి గ్రామంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఉందో లేదో తెలియదు కానీ, మందు షాపు ఉంది. ఫోన్‌కొడితే నీరు తీసుకురావడం లేదు..మందు మాత్రం హోం డెలివరీ చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇప్పటికే మూడు సార్లు కరెంటు బిల్లులు పెంచారు.  ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే భయపడుతున్నాం. పండగ వచినప్పుడు ఆర్టీసీ టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం తీసుకురావాలి. ఈ వ్యవస్థలో మార్పు జరగాలంటే ఒక్క వైయస్‌ జగన్‌తోనే సాధ్యం కాదు. జగన్‌కు మీ అందరి దీవెనలు కావాలి. అప్పుడు మార్పు వస్తుంది. ఏదైనా రాజకీయ నాయకుడు మైక్‌ పట్టుకొని పలానిది చేస్తానని చెప్పి, ఆ తరువాత చేయకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. 

బాబును క్షమిస్తే..
పొరపాటున చంద్రబాబును రేపొద్దున క్షమించినారంటే..ఆయన మీ వద్దకు వచ్చి పెద్ద పెద్ద అబద్ధాలు చెబుతారు. పెద్ద పెద్ద మోసాలు చేస్తారు. రేపు పొద్దున ఏమంటారో తెలుసా? ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటాడు. నమ్ముతారా? బంగారానికి బోనస్‌ అంటాడు. బోనస్‌ ఏంటో తెలుసా? ప్రతి ఇంటికి బెంజి కారు కొనిస్తా అంటారు. ప్రతి ఇంటికి మనిషిని పంపించి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతాడు. డబ్బులు ఇస్తే వద్దు అనకండి..రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బు మనదే. మన జేబులు కత్తరించి మన వద్ద నుంచి దోచేసిన సొమ్మే. ఎవరు డబ్బువద్దనకండి. ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం వేయండి. అబద్ధాలు చెప్పే వారిని, మోసం చేసే వారిని బంగాళఖాతంలో కలపండి. అప్పుడే ఈ  వ్యవస్థలో విశ్వసనీయత, ని.జాయితీ అన్న పదాలకు అర్థం  వస్తుంది.

మనం ఏం చే స్తామంటే..
రేపు పొద్దన మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ప్రతి సభలో కొన్ని నవరత్నాలు చెబుతున్నాం.  అ రోజు ఈ సభలో నవరత్నాల నుంచి పిల్లల చదువుల కోసం ఏం చేస్తామన్నది చెబుతున్నాను. అవస్థలు పడుతున్న తల్లిదండ్రుల కోసం మనం ఏం చేస్తున్నామో చెబుతున్నాను.

ఎన్ని లక్షలైనా..
ఒకసారి మీ గుండెలపై చేతులు వేసుకొని పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లు చదివించే స్థోమత మనకు ఉందా? ఇంజినీరింగ్‌ ఫీజులు చూస్తే లక్షల్లో ఉంది. చంద్రబాబు మాత్రం రూ.35 వేలు ముష్టి వేసినట్లు వేస్తున్నారు. అది కూడా ఏడాది దాటినా విద్యార్థుల ఖాతాలో జమా కాలేదు.  మిగతా డబ్బు ఆ పేద కుటుంబం ఎక్కడ నుంచి తెస్తారు. నాలుగేళ్ల ఇంజీనీరింగ్‌ కోర్సుకు రూ.3 లక్షలు ఇంటి నుంచి పంపించాలి. ఆ డబ్బు కోసం పేదవాడు ఇల్లు, పొలం అమ్ముకోవాల్సి వస్తోంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబుకు బీసీలపై ప్రేమ అంటారు. నాలుగు కత్తేర్లు ఇవ్వడమే ఆయనకు తెలిసిన ప్రేమ. బీసీలపై నిజమైన ప్రేమ చూపించింది దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అని గర్వంగా చెబుతున్నాను. మహానేత పాలనలో పేదవారు ఏం చదవాలన్నా..నేనున్నానని ప్రతి పేదవాడిని చదివించారు. ఇవాళ ఆ దివంగత ముఖ్యమంత్రి చనిపోయారు. మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చాక నాన్నగారు పేదవారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తానని చెబుతున్నాను. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..ఎంత ఖర్చైనా ఫర్వాలేదు..నేను భరిస్తాను. ఏ పేదవాడు కూడా చదువుల కోసం అప్పులపాలు అవ్వాల్సిన పరిస్థితి రాకుడదు. పిల్లలు హాస్టల్‌ ఉండి చదువుకునేందుకు ఖర్చు అవుతుంది. హాస్టల్‌ ఖర్చుల కోసం ప్రతి విద్యార్థికి రూ.20 వేలు ప్రతి ఏటా ఇచ్చి తోడుగా ఉంటాను. 

ఏ బడికి పంపించినా..
చిట్టి పిల్లలు రేపు పొద్దున ఇంజినీర్‌ కావాలి. వారు ఉన్నత స్థానంలో ఉండాలంటే చిన్నప్పుడే మంచి పునాదులు పడాలి. అందుకే చెబుతున్నాను..పిల్లలను బడికి పంపించినందుకు ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తాం. ఏ బడికి పంపించినా చాలు రూ.15 వేలు ఇస్తాం. వారు డాక్టర్లు, ఇంజినీర్లు అయితేనే మన బతుకులు మారుతాయి. రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక చదువుల విప్లవం తీసుకువస్తాను. నవరత్నాలలో సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే నేను ఎక్కడ ఉంటున్నానో మీ అందరికి తెలుసు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిన మీ బిడ్డకు తోడుగా నిలవమని కోరుతున్నాను. ఇక్కడికి వచ్చి ప్రేమానురాగాలు చూపినందుకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా..
 
Back to Top