డీఏ సోమయాజులు మృతి పట్ల వైయ‌స్‌ జగన్‌ దిగ్బ్రాంతి

 

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా: వైయ‌స్ఆర్ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున 3.14 గంటలకు స్వర్గస్థులయ్యారు. ఆయన మృతి పట్ల వైయ‌స్ఆర్‌ అధ్యక్షులు, ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమయాజులు మృతి పట్ల వైయ‌స్‌ జగన్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు వైయ‌స్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.  ఇవాళ మ‌ధ్యాహ్నం జ‌రుగ‌బోయే సోమ‌యాజులు అంత్య‌క్రియ‌ల్లో పాల్గొనేందుకు వైయ‌స్ జ‌గ‌న్ నేటి పాదయాత్రను, బహిరంగ సభను రద్దు చేసుకుని  హుటాహుటిన హైదరాబాద్‌ బయలుదేరారు.

సోమయాజులు బౌతికకాయానికి వైయ‌స్‌ జగన్‌ నివాళులర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. గత కొంత కాలంగా డీఏ సోమయాజులు శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.
Back to Top