త్యాగం..సహనం బక్రీద్‌ సందేశం

విశాఖ: త్యాగం, సహనం బక్రీద్‌ సందేశమని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదర సోదరీమణులకు జననేత వైయస్‌ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. అల్లాహ్‌ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ లభించాలని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు.

 
Back to Top