స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వైయ‌స్‌ జగన్‌విశాఖ‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విశాఖ జిల్లా ఎర్రవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఎర్రవరం జంక్షన్‌ వద్ద పాదయాత్ర విడిది శిబిరం వద్ద వైయ‌స్‌ జగన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికి వైయ‌స్‌ జగన్‌ శుభాకాంక్షాలు తెలిపారు. కార్య‌క్ర‌మంలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేత‌లు పాల్గొన్నారు.
Back to Top