14 నుంచి విశాఖ‌లో ప్రజా సంకల్పయాత్ర

విశాఖ‌: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఈ నెల 14వ తేదీ విశాఖ‌లోకి అడుగుపెడుతుంద‌ని పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌ల‌శీల ర‌ఘురామ్‌, గుడివాడ అమ‌ర్‌నాథ్ తెలిపారు.  నర్సీపట్నం నియోజకవర్గంలోని గన్నవరం మెట్టు నుంచి జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర మొదలు కానుంది. అక్కడి నుంచి శరభవరం ఎల్లవరం, దొండపేట, ములగపూడి, బెన్నవరం, నయ్యపురెడ్డిపాలెం, నర్సీపట్నం మీదుగా.. పాయకరావుపేట నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఈ నియోజకవర్గంలో యండపల్లి, సుంకపూరు, కోటవురట్ల, గొట్టివాడ, ములగల్లోవ, దార్లపూడి, ఏటికొప్పాక మీదుగా సాగతుంది. అనంతరం యలమంచిలి నియోజకవర్గంలో ప్రవేశించనున్న పాదయాత్ర పులపర్తి, పురుషోత్తపట్నం, రేగుపాలెం, యలమంచిలి, అచ్యుతాపురం, కొండకర్ల జంక్షన్, హరిపాలెం, తిమ్మరాజుపేట, మునగపాక మీదుగా అనకాపల్లి నియోజకవర్గంలోని తుమ్మపాలకు చేరుకుంటుంది. తుమ్మపాల మీదుగా బావులపాడు, మామిడిపాలెం, గంధవరం, వెంకన్నపాలెం మీదుగా చోడవరం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. గోవాడ, గణపతినగరం, చోడవరం మీదుగా రేవళ్లు, గౌరవరం, కొత్తవూరు, ఎ.భీమవరం, పొడుగుపాలెం, ఎ.కోడూరు, సూరెడ్డిపాలెం, సింగరెడ్డిపాలెం మీదుగా మాడుగుల నియోజకవర్గంలోకి పాదయాత్ర సాగుతుంది. ఈ నియోజకవర్గంలో కె.కోటపాడు, జోగన్నపాలెం, రామచంద్రపురం మీదుగా పెందుర్తి నియోజకవర్గంలోని గులిపల్లి, సబ్బవరం మీదుగా ప్రజాసంకల్పయాత్ర సాగతుంది.అక్కడి నుంచి విశాఖ నగర పరిధిలో జరిగే పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ త్వరలో ఖరారు కానుంద‌ని వెల్ల‌డించారు.  ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా రాయలసీమ, కోస్తాంధ్రలో పాదయాత్ర పూర్తి చేసుకుని ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ జిల్లాలో ఈనెల 14న అడుగుపెట్టనుండ‌టంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జ‌న‌నేత రాక‌కోసం జిల్లా వాసులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.



తాజా వీడియోలు

Back to Top