రాష్ట్ర‌వ్యాప్తంగా 200వ రోజు పండుగ‌

- ఘ‌నంగా ప్రజాసంకల్పయాత్ర 200వ రోజు వేడుకలు
- సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు
 
 అమరావతి: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారం 200వ రోజు మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలు సామాజిక కార్యక్రమాలు, సంఘీభావ యాత్రలు చేపట్టారు. ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆలయాల్లో ప్రత్యేక​ పూజలు నిర్వహించారు. వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర కీలక ఘట్టానికి చేరుకోవడంతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. తూర్పు గోదావ‌రి జిల్లా అమ‌లాపురంలో నిర్వ‌హించిన స‌ర్వ మ‌త ప్రార్థ‌న‌లో వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొన్నారు. హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన వేడుక‌ల్లో పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, అంబ‌టి రాంబాబు, గ‌ట్టు శ్రీ‌కాంత్‌రెడ్డి పాల్గొని కేక్ క‌ట్ చేశారు. విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో పార్టీ నాయ‌కులు కేక్ క‌ట్ చేసి సంబ‌రాలు జ‌రుపుకున్నారు. 

పేదలకు చీరల పంపిణీ
వైయ‌స్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వైయ‌స్ఆర్‌సీపీ  కన్వీనర్‌ గ్రంధి శ్రీనివాస్‌ పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్‌ కోడే యుగంధర్‌, రాష్ట్ర ప్రధాన కార్శదర్శి కొయ్యే మోసేన్‌రాజు, వేగిరాజు రామకృష్ణంరాజు, గాదిరాజు సుబ్బరాజు, గూడూరి ఉమాబాల, కనకరాజు సూరి, ఏఎస్‌రాజు, మేడిదిజాన్స్‌, ఎన్‌వీఆర్‌ దాసు తదితరులు పాల్గొన్నారు. 

కొఠారు అబ్బాయి చౌదరి పాదయాత్ర
వైయ‌స్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొఠారు అబ్బాయి చౌదరి ఆధ్వర్యంలో పెదవేగి మండలం బాపిరాజుగూడెం నుంచి విజయరాయి వరకు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కోటగిరి శ్రీధర్, కొఠారు రామచంద్రరావు, కమ్మ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జగన్ పాదయాత్ర 200 రోజులు పూర్తిచేసుకున్నందున వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ప్రజల సమక్షంలో బాపిరాజుగూడెంలో వైఎస్సార్ నేతలు కొఠారు అబ్బాయి చౌదరి, కోటగిరి శ్రీధర్ కేక్ కట్ చేశారు.


విద్యార్థులకు సోట్‌ బుక్స్‌, పెన్నుల పంపిణీ
వైయ‌స్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తణుకు వైయ‌స్ఆర్‌సీపీ  కోఆర్డినేటర్‌ కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తణుకు ఏరియా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేశారు. అత్తిలి మండంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌ బుక్స్‌, పెన్నులు పంచిపెట్టారు. తాడేపల్లిగూడెంలో వైఎస్సార్‌ సీపీ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో  200 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసి, పలు సేవకార్యక్రమాలు చేపట్టారు.

అనంతపురంలో..
వైయ‌స్ జగన్ పాదయాత్ర విజయవంతంగా 200 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా వైఎస్సార్ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌ విద్యార్థి విభాగం నేతలు కేక్‌ కట్‌ చేశారు.

వైయ‌స్ఆర్‌ జిల్లాలో బైక్‌ ర్యాలీ
వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర రెండు వందల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా  జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల కోసం తమ అధినేత పాదయాత్ర చేస్తున్నారని కార్యకర్తలు తెలిపారు. శివ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పొద్దుటూరులో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

చిత్తూరులో ప్రత్యేక పూజలు
పేద ప్రజల కష్టాలను తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ ఆరోగ్యం బాగుండాలని కోరుతూ కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయంలో ఐరాల కన్వీనర్‌ బుజ్జిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కేక్ కట్ చేసి వేడుకలు
ప్రజాసంకల్పయాత్ర 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా గుంటూరు నగర పార్టీ కార్యాలయంలో వైయ‌స్ఆర్‌సీపీ  నేతలు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. లేళ్ల అప్పిరెడ్డి, ఆత్కూరి ఆంజనేయులు, పాదర్తి రమేష్, ఝాన్సీ, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆంధ్ర యూనివర్సిటీలో...
వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్ధి విభాగం కాంతారావు ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు, ఉద్యోగులు.

మొక్కు చెల్లించుకున్న వైవీ సుబ్బారెడ్డి
వైయ‌స్ఆర్‌సీపీ ఉభయగోదావరి జిల్లా పరిశీలకులు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తూర్పుగోదావరి జల్లా అయినవిల్లి విఘ్నేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు.

ప్రత్యేక పూజలు
విజయవాడ కెనాల్‌ రోడ్డులోని వినాయకుడి ఆలయంలో మల్లాది విష్ణు, జోగి రమేశ్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ 200 కొబ్బరి కాయలు కొట్టారు. 
  క‌ర్నూలులో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో 200 టెంకాయ‌లు కొట్టి పూజ‌లు చేశారు.


Back to Top