దుల్హాన్‌ పథకం కింద లక్ష రూపాయలు


నెల్లూరు: మైనారిటీల కోసం దుల్హాన్‌ పథకం కింద రూ. లక్ష రూపాయలు అందజేస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని హసనాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో వైయస్‌ జగన్‌ ముస్లిం సొదరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మైనారిటీల ముఖిముఖి ఇలా..

మైనారిటీలను రాజకీయంగా ప్రోత్సహించాలి: రఫీ
2014లో వైయస్‌ఆర్‌సీపీ మైనారిటీలకు నాలుగు సీట్లు ఇచ్చారు. ఈసారి ఎక్కువ ఇస్తే బాగుంటుంది. మైనారిటీలను రాజకీయ పరంగా ప్రోత్సహించాలన్నా..
వైయస్‌ జగన్‌: ఈ సారి మైనారిటీలకు ఎంత వీలైతే అంత వరకు చేస్తాం
–––––––––––––––
మీ మీద అభిమానం లక్ష రేట్లు పెరిగింది: అక్బర్‌ అలీ
మైనారిటీలకు విద్యార్థులకు ప్రతి జిల్లాకు ఒక కాలేజీ ఏర్పాటు చేయాలి. స్కూల్స్‌ ఏర్పాటు చేయాలి. గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పది శాతం మైనారిటీలకు ఇస్తామని వైయస్‌ఆర్‌ జీవో ఇచ్చారు. ఇది అమలు చేయడం లేదు. దీన్ని 15 శాతం చేసి మైనారిటీలకు మేలు చేయాలని కోరుతున్నాను. సబ్‌ప్లాన్‌ అమలు చేయాలి. మిగిలిన నిధులు వచ్చే బడ్జెట్‌లో కల్పించాలి. చంద్రబాబు ఇస్లామిక్‌బ్యాంకు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు మోసం చేశారు. మీరు అధికారంలోకి వచ్చాక ఇస్లామిక్‌ బ్యాంకు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. మా బావ డయాలసిస్‌ పేషేంట్‌. మీరు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు ఇస్తామంటే నాకు మీ మీద లక్ష రేట్ల అభిమానం పెంచింది సార్‌
––––––––––––––––––––––––
బాలికలకు త్రిపుల్‌ ఐటీ కాలేజీ ఏర్పాటు చేయాలి: రిజ్వాన్‌
ప్రతి బీడి, భవన కార్మికుడి ఇంట్లో ఇంజినీర్‌ ఉన్నారంటే అది దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమే. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించి ఆదుకున్నారు. నాన్నగారు ఇడుపులపాయలో త్రిపుల్‌ ఐటీ కాలేజీ కట్టించారు. మా నియోజకవర్గం నుంచి 150 మంది చదువుతున్నారు. బాలికల త్రిపుల్‌ ఐటీ కాలేజీ స్థాపించి ఆదుకోవాలని కోరుతున్నాం. ముస్లిం మైనారిటీలు అత్యంత దారుణమైన స్థితిలో ఉన్నారు. ఇందుకు చంద్రబాబే కారణం. మీరు అధికారంలోకి వచ్చాక మైనారిటీలను ఆదుకోవాలని కోరుతున్నాం. ముస్లింలకు కూడా ఒక సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేసి మైనారిటీలను ఆదుకోవాలని కోరుతున్నాను.

వైయస్‌ జగన్‌: దేవుడి దయ వల్ల, మీ అందరి చల్లని దీవెన వల్ల మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి, మీ గ్రామంలోనే పది మందికి ఉద్యోగాలు ఇస్తాం. మీకు ఇల్లు, రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా..72 గంటల్లోనే మీకు ఇప్పించే ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో కులాలు, మతాలు చూడం. ఎంత మంది అర్హులు ఉంటే అందరికి న్యాయం చేస్తాం. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని మాట ఇస్తున్నాను.
––––––––––––––––––
కాబోయే ముఖ్యమంత్రి మీరే:  ఇమాంసా
2019 ఎన్నికల్లో మీరు అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రి అవుతారు. ఈ రోజు మసీద్‌ ఇమామ్‌లకు రూ.3000, రూ.5 వేలు ఇస్తున్నారు. పల్లెల్లో చందాలు వేసి వారికి ఇచ్చే పరిస్థితి లేదు. మసీదులు మూతపడుతున్నాయి. 

వైయస్‌ జగన్‌: ఇవాళ ప్రభుత్వం మౌజీమ్‌లకు, ఇమామ్‌లకు ఇస్తున్న దాన్ని పెంచుతాం. ఇమాములకు రూ.10 వేలు, మౌజీమ్‌లకు రూ.5 వేలు ఇస్తాం. అందరికి అందేలా చూస్తాం. ఒక్క మసీదుకే కాదు గుడికి, చర్చీలకు కూడా ఇదేలాగా ఇస్తాం. మనిషి తప్పు చేయకుండా ఉండేందుకు దైవభక్తి అవసరం. ఎప్పుడైతే మనిషి దేవుడి వైపు వెళ్లి సమయం కేటాయిస్తాడో అప్పుడు తప్పు చేసేందుకు వెనుకాడుతాడు. దుల్హాన్‌ పథకానికి రూ. 50 వేలు ఇస్తున్నాను. అది కూడా పెళ్లి అయిన తరువాత ఇ వ్వడంతో గొడవలు మొదలవుతున్నాయి. దాని కోసం కమీషన్లు కూడా తీసుకుంటున్నారు. మనం గ్రామ సెక్రటరెట్‌ తీసుకొని వస్తాం. పెళ్లి రోజే పెళ్లి కూతురు తల్లిదండ్రుల చేతుల్లో ఆ డబ్బు పెడతాం. 
––––––––––––––––––
వక్ఫ్‌బోర్డు ఆస్తులు రక్షించాలి: రహంతుల్లా
బీసీ ఈ సర్టిపికెట్‌ కోసం చాలా మంది వస్తున్నారు. చాలా మంది పల్లెటూర్లు బాధపడుతున్నారు. అందరికి బీసీ–ఈ సర్టిఫికెట్లు ఇచ్చేలా చూడండి. మా నాయుడుపేట నియోజకవర్గంలో మైనారిటీలు బీడీ కార్మికులుగా ఉన్నారు. వైశ్యులు మా వక్ఫ్‌బోర్డు ఆస్తులను వాడుకుంటున్నారు. వక్ఫ్‌ బోర్డు ఆస్తులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలి. 

వైయస్‌ జగన్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అన్నది కులం, మతం చూడం. ఆరోగ్యశ్రీ కూడా అంతే, ఇల్లు, పింఛన్లు అన్నింటికి కూడా ఏ భేదం చూడం. ఉద్యోగాల విషయంలో మాత్రమే ఈ సమస్య వస్తుంది. మనకు రాజ్యంగంలో ఉన్న పరిస్థితి ఒక్కసారి గమనించి మంచి నిర్ణయం తీసుకుందాం. మన రాజ్యాంగంలో మతాలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు. ఆ రోజు ఒక సర్వే చేసి ముస్లింకు రిజర్వేషన్లు చేశారు. ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ల విషయంలో సాధ్యమైనంత వరకు న్యాయం చేస్తాం. వైశ్యుల ఆస్తి, చర్చీ, గుడి ఆస్తులు ఎవరైనా అక్రమాలు చేస్తే దేవుడి దృçష్టిలో అన్యాయం. ఎక్కడైనా అన్యాయం జరిగితే న్యాయం జరిగేలా చూస్తాం.
–––––––––––––––––––––––
అగ్రిగోల్డు డబ్బులు ఇప్పించండి
మా పిల్లాడు అగ్రిగోల్డులో ఉండి రూ.50 లక్షలు నష్టపోయారు. మా డబ్బులు మాకు ఇప్పించండి సారూ.

వైయస్‌ జగన్‌: అగ్రిగోల్డుకు సంబంధించి రూ.1100  కోట్లు చెల్లిస్తే బాధితులకు న్యాయం జరుగుతుందని నేను అసెంబ్లీలో మాట్లాడాను. అగ్రీ గోల్డు ఆస్తులన్నీ కూడా చంద్రబాబు, ఆయన బినామీలు తీసుకున్నారు. నాలుగేళ్లు అయింది ఇంతవరకు బాధితులకు ఒక్కరికి కూడా న్యాయం జరుగలేదు. మన ప్రభుత్వం వచ్చాక వెంటనే 80 శాతం మందికి మేలు జరిగేలా చూస్తాం. అగ్రి గోల్డు ఆస్తులను ప్రభుత్వమే వేలం వేస్తుంది.
 
Back to Top