అలుపెర‌గ‌ని యోధుడు

- విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
-  అచ్చంపేట జంక్షన్‌ నుంచి 218వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
తూర్పు గోదావ‌రి: వేసే ప్రతి అడుగూ.. ప్రజా శ్రేయస్సుకు పునాదిగా, వెళ్తున్న ప్రతి బాటా జనక్షేమానికి పరచిన పూలదారిగా... వైయ‌స్ఆర్  సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది. ప్రతిక్షణం ప్రజాహితమే లక్ష్యమని, కర్షక, కార్మిక, నిరుద్యోగ, ఉద్యోగులకు అండగా ఉండటమే ధ్యేయమని నినదిస్తోంది.  భారీ సంఖ్యలో ప్రజలు.. ప్రభుత్వం పట్టించుకోక, పథకాలు అందక, బతుకు భారమై పుట్టెడు కష్టాలతో నాలుగేళ్లుగా పాటు బాధను దిగమింగుకుంటున్న బాధితులకు ప్రజలకు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో ఆశాదీపం కన్పించింది.


అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత ఆదివారం ఉదయం పెద్దాపురం నియోజకవర్గం అచ్చంపేట జంక్షన్‌ నుంచి 218వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి సామర్లకోట మండలం గొంచాల, బ్రహ్మానందపురం, పీ.వేమవరం శివారు మీదుగా ఉండూరు వరకు నేటి పాదయాత్ర కొనసాగనుంది.  వైయ‌స్ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.

         


తాజా ఫోటోలు

Back to Top