మొక్కవోని సంకల్పం.. ప్రజా శ్రేయస్సే ధ్యేయం
బురదమయమైన రోడ్లపైనే కొనసాగుతున్న పాదయాత్ర
వైయస్‌ జగన్‌ను కలిసేందుకు వేలాది తరలివస్తున్న ప్రజలు 
తూర్పుగోదావరి: మొక్కవోని సంకల్పం.. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం.. ప్రజల సంతోషమే తన సంతోషంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 213వ రోజు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. వర్షాల కారణంగా రోడ్లన్నీ బురదమయమైనా.. ప్రజల కళ్లలో కన్నీరు తూడ్చాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. అడుగు తీసి.. అడుగు వేయలేని దుస్థితి ఉన్నా.. నిండు మనస్సుతో తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలను కలుసుకునేందుకు ముందుకు సాగుతున్నారు. వర్షాల కారణంగా అనపర్తి నియోజకవర్గ పరిధిలోని రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. ఆ రోడ్లపైనే వైయస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 
అన్నా మా సమస్యలు పరిష్కరించండి..
గొల్లల మామిడాల గ్రామ మహిళలు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకొని స్థానిక సమస్యలపై వినతిపత్రం అందజేశారు. తాగునీరు లేదని, రేషన్‌ సరుకులు సరిగ్గా ఇవ్వడం లేదని, అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వడం లేదని, చంద్రబాబును నమ్మి మోసపోయామని డ్వాక్రా సంఘాల మహిళలు ఇలా ఒకొక్కరు జననేతను కలిసి వారి సమస్యలను వివరించారు. ఇంకొక్క సంవత్సరం ఓపిక పట్టాలని, తరువాత మన ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వం వస్తుందని, రాష్ట్ర రథచక్రాలు మహిళలేనని వైయస్‌ జగన్‌ వారికి హామీ ఇచ్చారు. 
Back to Top