కొత్త‌పేట‌..పూల‌బాట




- తూర్పు గోదావ‌రి జిల్లాలో విజ‌య‌వంతంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
- అడుగ‌డుగునా రాజ‌న్న బిడ్డ‌కు బ్ర‌హ్మ‌ర‌థం
- దారి పొడ‌వునా క‌ష్టాలు చెప్పుకుంటున్న కోన‌సీమ ప్ర‌జ‌లు

తూర్పు గోదావరి:  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు త‌మ ప్రాంతానికి వ‌చ్చిన వైయ‌స్ జ‌గ‌న్‌కు తూర్పు గోదావ‌రి జిల్లాలో అపూర్వ స్వాగ‌తం ల‌భిస్తోంది. దారి పొడ‌వునా పూల‌బాట ప‌రిచి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. మ‌రోవైపు నాలుగేళ్లుగా ఎదుర్కొంటున్న క‌ష్టాల‌ను జ‌న‌నేత‌కు చెప్పుకొని స్వాంత‌న పొందుతున్నారు.  వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర  గురువారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా పేరవరం నుంచి ప్రారంభ‌మైంది. అక్కడి నుంచి వెలిచేరు, వడ్డిపర్రు క్రాస్‌ మీదుగా పులిదిండి చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉచిలి, ఆత్రేయపురం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. వెలిచేరు వ‌ద్ద జ‌న‌నేత‌కు దారి పొడ‌వునా పూలు ప‌రిచి, వాయిద్యాల‌తో స్వాగ‌తం ప‌లికారు. రాజన్న బిడ్డను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు, పార్టీనేతలు, తరలివచ్చారు.  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట అశేష ప్రజానీకం అడుగులో అడుగేసి సంఘీభావం తెలిపింది.

ఈ నెల 12న‌ రాజమహేంద్రవరంలో అడుగుపెట్టిన జననేతకు అపూర్వ రీతిలో ప్రజలు ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. 13న ధ‌వ‌ళేశ్వ‌రం బ్రిడ్జి వ‌ద్ద అపూర్వ స్వాగ‌తం ల‌భించింది. ఇవాళ కొత్త‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో ఆత్మీయ స్వాగ‌తం ల‌భించింది. దారి పొడ‌వునా క‌ష్టాలు చెప్పుకుంటూ జై జగన్‌.. అని నినాదాలు చేస్తూ ఊరూరా హోరెత్తించారు. మహిళలు, విద్యార్థినులు సెల్ఫీలు తీసుకోవడానికి, కరచాలనం చేయడానికి పోటీపడ్డారు. గ్రామంలోకి వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రవేశిస్తున్నపుడు భారీ ఎత్తున జనం ఎదురేగి ఆయనకు స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గుమ్మడికాయలతో హారతి పట్టారు.  ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. వారి సమస్యలను విన్న వైఎస్‌ జగన్, భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
Back to Top