మిరప రైతుల సమస్యలపై పోరాడుదాం

  • రుణమాఫీ, ఇన్ పుట్ సబ్సిడీపై ఆరా
  • బాబు ఇచ్చిన రుణాలు వడ్డీలకు కూడా సరిపోలేదని రైతుల ఆందోళన
  • అధైర్యపడొద్దని అండగా ఉంటానని రైతన్నకు వైయస్ జగన్ భరోసా
  • ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని హామీ
కర్నూలు: కర్నూలు జిల్లాలో రైతు భరోసాయాత్ర చేస్తున్న జననేత వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం సంతజూటూరులో తెగుళ్ల కారణంగా నష్టపోయిన మిరప పంటలను పరిశీలించారు. రైతులను అడిగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. రుణమాఫీ, ఇన్‌ పుట్‌ సబ్సిడీ గురించి ఆరా తీశారు. ఇప్పటివరకు రుణమాఫీ చేసిన డబ్బులు వడ్డీకి కూడా సరిపోలేదని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అధైర్య పడొద్దని రైతులకు జగన్‌ భరోసానిచ్చారు. అన్నదాతల సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని హామీ ఇచ్చారు. వైయస్ జగన్ తో కరచాలనం చేసేందుకు పార్టీ నేతలు, అభిమానులు, ప్రజలు పోటీపడ్డారు. ప్రతీ ఒక్కరినీ వైయస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. వైయస్ జగన్ వెంట పార్టీ నేతలు గౌరు వెంకట్ రెడ్డి, అనంతవెంకట్రామిరెడ్డి, బుట్టా రేణుక, బుడ్డా శేషారెడ్డి, ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులున్నారు. 

అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు కర్నూలు జిల్లాలో వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘రైతు భరోసా యాత్ర’ జిల్లాలో నాలుగవ రోజు కొనసాగుతోంది.  నేటి యాత్ర వెలుగోడు మండలం వేల్పనూరులో ప్రారంభమైంది. అక్కడి నుంచి సంతజుటురు, నారాయణపురం, చిన్నదేవలపురం, లింగాపురం, జీసీ పాలెం, సింగవరం, సోమయాజులపల్లె, మణికంఠాపురం, వీర్నపాడు మీదుగా వైయస్ జగన్ రోడ్ షో కొనసాగుతుంది. నేటి యాత్రలో భాగంగా లింగాపురంలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైయస్ఆర్ విగ్రహాన్ని  వైయస్ జగన్ ఆవిష్కరించున్నారు

Back to Top