పిరాయింపులు అంటేనే జాఢ్యం

న్యూఢిల్లీ) పార్టీ ఫిరాయింపులు జాఢ్యంగా మారాయ‌ని జేడీయూ పార్టీ ర‌థ సార‌ధి శ‌ర‌ద్ యాద‌వ్ అభిప్రాయ ప‌డ్డారు. ఇది అనేక రాష్ట్రాల్లో విస్త‌రిస్తోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. న్యూఢిల్లీ లోని శ‌ర‌ద్ యాద‌వ్ నివాసంలో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ స‌మావేశం అయ్యారు. ఆయ‌న‌తో పాటు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స‌మావేశంలో పాల్గొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేస్తున్న అరాచ‌కాల్ని వైఎస్ జ‌గ‌న్ విడ‌మ‌రిచి చెప్పారు. అవినీతికి పాల్ప‌డి చంద్ర‌బాబు కోట్ల‌కు కోట్లు దోచుకొంటున్న విష‌యాన్ని ఆధారాల‌తో స‌హా చెప్పారు. అవినీతి తో సంపాదించిన సొమ్ముల్ని వినియోగించి ప్ర‌తిప‌క్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తున్న విష‌యాన్ని శ‌ర‌ద్ యాద‌వ్ దృష్టికి తీసుకొని వ‌చ్చారు. ప్ర‌జాస్వామ్యాన్ని తుంగ‌లోకి తొక్కి చంద్ర‌బాబు చేస్తున్న చ‌ర్య‌ల్ని వైఎస్ జ‌గ‌న్ వివ‌రించారు. దీని మీద శ‌ర‌ద్ యాద‌వ్ సానుకూలంగా స్పందించారు. ఫిరాయింపుల జాఢ్యం అన్ని చోట్లకు పాకుతోంద‌ని శ‌ర‌ద్ యాద‌వ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 
Back to Top