ప్రణబ్ జీ.. విచారణ జరిపించండి..!

రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్న కాల్ మనీ సెక్సు రాకెట్ విషయంలో సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని 
 ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విన్నవించారు. నిబంధనలకు విరుద్దంగా శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే రోజా మీద సస్పెన్షన్ ఎత్తివేసేలా స్పీకర్ కు సూచించాలని ఆయన కోరారు. సికింద్రాబాద్ లోని బొల్లారం అతిథి నివాసంలో శీతాకాలపు విడిది చేసిన రాష్ట్రపతిని వైఎస్ జగన్ ఆదివారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు కాల్ మనీ సెక్సు  రాకెట్ తో పాటు తెలుగుదేశం సాగిస్తున్న దురాగతాల మీద ఒక వినతి పత్రం సమర్పించారు. దీంతో పాటు బాక్సైట్ గనులు, ప్రత్యేక హోదా మీద వేర్వేరుగా వినతి పత్రాలు అందించారు.  
Back to Top