ఎమ్మెల్సీ బోస్ కు వైఎస్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌

హైదరాబాద్:  మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియ‌ర్ నేత పిల్లి సుభాస్ చంద్ర‌బోస్ ను పార్టీ అధ్యక్షులు, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శించారు. నిమ్స్ ఆసుప‌త్రిలో ఆయ‌న చికిత్స పొందుతున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లా రామ‌చంద్ర‌పురానికి చెందిన బోస్ దివంగ‌త వైఎస్సార్ హ‌యంలో మంత్రిగా ప‌నిచేశారు. వైఎస్ జ‌గ‌న్ కోసం మంత్రివ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన నేత‌గా ఆయ‌న‌కు గుర్తింపు ఉంది. త‌ర్వాత కాలంలో బోస్ సేవ‌ల‌కు గాను ఎమ్మెల్సీ ప‌ద‌విని ఆయ‌న‌కు కేటాయించ‌టం జ‌రిగింది. కొంత కాలంగా ఆయ‌న గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నారు.  రక్తనాళాల్లో సమస్య ఉండడంతో బోస్‌కు  శస్త్ర చికిత్స నిర్వహించి రెండు స్టెంట్‌లు వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వైఎస్  జగన్ వెంట పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి,  అప్పిరెడ్డి, సునీల్‌లు ఉన్నారు.
Back to Top