గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్

హైదరాబాద్ః చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలకు నిరసనగా  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు రాష్ట్రవ్యాప్తంగా ‘సేవ్ డెమొక్రసీ’ నిర్వహించనుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బాబు అనైతిక చర్యలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతోంది. మరోవైపు ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి  ఉదయం 11 గంటలకు గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు. 

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై గవర్నర్‌కు వైఎస్ జగన్ ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ సీనియర్ నేతలతో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుస్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం వైఎస్సార్‌సీపీ చేపట్టిన సేవ్ డెమోక్రసీ కార్యక్రమాలకు వామపక్షాలతో పాటు పలు రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. సాయంత్రం అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీలు, బహిరంగసభలు నిర్వహించనున్నారు. 
Back to Top