– రైతులందరికీ ఏటా రైతు భరోసా కింద రూ.12500– రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి– ప్రతి మండల కేంద్రంలో కోల్డు స్టోరేజ్ ఏర్పాటు– రూ.4 వేల కోట్లతో వైఫరీత్యాల నిధి ఏర్పాటు చేస్తాం– అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం– గుండ్రెవుల ప్రాజెక్ట్ నిర్మించి రైతుల కన్నీళ్లు తుడుస్తా– వైయస్‌ఆర్ హయాంలో రైతులకు వడ్డీ మాఫీ జరిగేది– నేడు రాష్ట్రంలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందడం లేదు– ముఖ్యమంత్రే దళారి అవతారం ఎత్తారు– హెరిటేజ్ షాపుల్లో ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు – రైతులు కన్నీరు పెడితే దేశానికే అరిష్టం– కోడుమూరులో రైతులతో వైయస్ జగన్ ముఖాముఖి
కర్నూలు: ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే తన లక్ష్యమని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కరువు వచ్చినా..అకాల వర్షం వచ్చినా అన్నదాతలను ఆదుకుంటామని, గిట్టుబాటు ధర కల్పిస్తానని జననేత హామీ ఇచ్చారు. ఈ చంద్రబాబు పాలనలో మనకు ఎలాగు న్యాయం చేయరన్న నమ్మకం లేదని, రాబోయే రోజుల్లో దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం వచ్చినప్పుడు మనం ఏం చేయాలన్న అంశాలపై మీ సలహాలు, సూచనలు ఇవ్వండి..నేను వింటాను అని వైయస్ జగన్ రైతులను కోరారు. రేపు మనం అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేస్తామని మాట ఇచ్చారు. రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. రాష్ట్రం కన్నీరు పెడితే దేశానికే అరిష్టమని తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా కోడుమూరులో సోమవారం రైతులతో వైయస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ కష్టాలు వైయస్ జగన్‌కు వివరించారు. వారి సమస్యలు విన్న జననేత రైతులకు ఏ కష్టం రానివ్వనని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. వైయస్ జగన్ ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..
– రైతులు చల్లగా బతకాలంటే మూడు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఒకటి రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గినప్పుడే తక్కువ రేటుతో ఉత్పత్తి చేయగలుగుతాడు. ఇవాళ దేవుడి దయ వల్ల, మీ అందరి దీవెనల వల్ల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి అంశంగా ఏం చేస్తామంటే..పెట్టుబడులు తగ్గించేందుకు, రైతుకు భరోసా కల్పించేందుకు మే మాసంలో ప్రతి రైతుకు కూడా రైతు భరోసా కూడా రూ.12500 ఇస్తాం. ఒక నెల ముందు ఈ డబ్బులు ఇస్తాం. ఈ డబ్బు కాస్తో కూస్తో వ్యవసాయం చేసుకునేందుకు ఉపయోగపడుతాయి. ఒక ఎకరా వేసుకునే వారికి ఈ డబ్బు 90 శాతం సరిపోతుంది. రెండు ఎకరాలు సాగు చేసే వారికి కనీసం 40 శాతమైనా ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు రైతు భరోసా పథకం కింద చిన్నా సన్నకారు రైతుకే ఇవ్వాలని భావించాం. కానీ పాదయాత్రలో రైతులు కోరడంతో ప్రతి రైతు కుటుంబానికి కూడా రూ.12,500 ఇస్తామని మాట ఇస్తున్నాను.
–ప్రతి రైతుకు 9 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇస్తామని చెబుతున్నాను. వీటి వల్ల పెట్టుబడులు తగ్గుతాయి. –పండించిన రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. రైతుల వద్ద కొనే సమయంలో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. రైతులకు అమ్మే సమయంలో రేట్లు ఆకాశానికి అంటుతున్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చివేస్తాం. ప్రతి పంట కొనుగోలు చేసే ముందుగానే రేటు చెబుతాం. ఏ రైతు కూడా గిట్టుబాటు ధర రాక నష్టపోకుండా చేస్తాను. ఇది సక్రమంగా జరిగించేందుకు ప్రతి మండలంలో కోల్డు స్టోరేజ్ ఏర్పాటు చేస్తాం. రైతులు తమ పంటలు భద్రపరిచేందుకు ఇవి ఉపయోగపడుతాయి. చంద్రబాబు నాడు మాటì చ్చి తప్పాడు. – రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని మాట ఇస్తున్నాను. రైతులకు గిట్టుబాటు ధర కోసం ఈ హామీ ఇస్తున్నాను.– వ్యవసాయం చేసుకున్న తరువాత మధ్యలో వ్యవసాయం చేసే రైతు నష్టపోయిçనప్పుడు ప్రభుత్వం ఆదుకుంటుంది అని ఎదురుచూస్తున్నారు. ఒక మనసున్న ప్రభుత్వం ఉంటే రైతులను ఆదుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో రైతుకు తోడుగా ఉన్నారు. రైతుల రుణాలకు సంబంధించి వడ్డీల మాఫీ జరిగేది. ఇవాళ చంద్రబాబు పాలనలో ఇన్‌పుట్‌సబ్సిడీ కూడా అందడం లేదు. కరువు మండలాలను ప్రకటించడం లేదు. కేంద్రం ఇస్తున్న ఇన్‌పుట్స్ సబ్సిడీని చంద్రబాబు వేరే అవసరాలకు వాడుకుంటున్నారు. దేవుడు దయ వల్ల మన ప్రభుత్వం వచ్చినప్పుడు రూ. 4 వేల కోట్లతో వైఫరీత్యాల నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇస్తున్నాను.– గాజుల దిన్నె ప్రాజెక్టు స్థిరీకరించబడాలంటే గుండ్రెవుల ప్రాజెక్టు చాలా అవసరమని అందరు చెబుతున్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు కట్టి రైతుల కన్నీళ్లు తుడుస్తాను. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుకు తోడుగా ఉంటామని హామీ ఇస్తున్నాను. ఈ ప్రాజెక్టు కడితే అన్ని రకాలుగా స్థిరీకరణ జరుగుతుంది. కోడుమూరులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కట్టి నీటి సమస్యను పరిష్కరిస్తాను.
– మీ చల్లని దీవెనలు, ఆలోచనలు ఇవమని కోరుతున్నాను. 3 వేల కిలోమీటర్లు సాగే ఈ యాత్రలో ఎవరైనా నన్ను రోడ్డుపైనే కలువవచ్చు. సలహాలు ఇవ్వమని కోరుతున్నాను. మన ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులను ఆదుకోవాలని ఆరాటపడుతున్నాను. కష్టాల్లో ఉన్న సమయంలో ఆప్యాయతలు చూపిస్తునందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.