గుండెల్లో గూడు క‌ట్టుకొన్నఆవేద‌న ఒకసారిగా బ‌య‌ట ప‌డింది

గుంటూరు: ప‌చ్చ‌ని పంట పొలాల‌తో క‌ళ క‌ళలాడాల్సిన ప‌ల్లె లు క‌న్నీరు పెడుతున్నాయి. రాజ‌ధాని కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో  రైతుల్ని క‌దిలిస్తే ఆవేద‌న పొంగి వ‌స్తోంది.  రైతులకు అండ‌గా ఉండేందుకు, వారిలో ధైర్యం నింపేందుకు, అసెంబ్లీ వేదిక‌గా రైతుల త‌ర‌పున పోరాటం చేసేందుకు..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌దాని ఎంపిక గ్రామాల్లో ప‌ర్య‌టించారు. అక్క‌డ రైతుల్ని, వ్య‌వ‌సాయ కూలీల్ని ప‌ల‌క‌రించిన‌ప్పుడు గుండెల్లో గూడు క‌ట్టుకొన్న ఆవేద‌న బ‌య‌ట ప‌డింది.

స్థానికంగా ఉండే మ‌ల్లేశ్వ‌ర‌మ్మ అనే వితంతు మ‌హిళ త‌న గోడును వెల్ల‌బోసుకొంది. ఉన్న రెండెక‌రాల పొలాల్ని లాక్కొంటే, ఎదిగిన కూతుళ్ల‌కు పెళ్లిళ్లు ఎలా చేయాల‌ని ఆమె వాపోయింది. ఆరు నూరైనా భూమిని వ‌దులుకొనేందుకు సిద్ధంగా లేమ‌ని ఆమె బోరుమంది. బాధ ప‌డాల్సిన ప‌ని లేద‌ని, బాధితులంద‌రికీ అండ‌గా ఉంటామ‌ని వైఎస్ జ‌గ‌న్ ఆమెను స‌ముదాయించారు.
Back to Top