రాజ‌ధాని ప‌రిస‌ర ప్రాంతాల్లో వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ప్రారంభం


గుంటూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధానిగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ అధ్య‌క్షుడు, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ర్య‌ట‌న ప్రారంభ‌మైంది. విజ‌యవాడ నుంచి గుంటూరు జిల్లా ఉండ‌వ‌ల్లి చేరుకొని అక్క‌డ రైతుల్ని, స్థానికుల్ని ప‌ల‌క‌రిస్తున్నారు. నూత‌న రాజ‌ధాని ఏర్పాటుకి వ్య‌తిరేకం కాద‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొద‌టినుంచీ చెబుతూనే ఉంది. జిల్లాలో వేల కొద్దీ ఎక‌రాల భూమి అందుబాటులో ఉండ‌గా, ప‌చ్చ‌ని పంట పొలాల్ని లాక్కోవ‌టం స‌రి కాద‌ని వాదిస్తోంది. అది కూడా రైతుల్ని బెదిరించి, భ‌య‌పెట్టి లాక్కోవ‌టంపై ఉద్య‌మాలు చేస్తూ వ‌స్తోంది. ప్ర‌జ‌ల ప‌క్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల్ని న‌డిపిస్తూ వ‌స్తున్న వైఎస్ జ‌గ‌న్ నేరుగా రాజ‌ధాని ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. భ‌యంతో వ‌ణికిపోతున్న రైతుల్ని ప‌ల‌క‌రించి వారిలో విశ్వాసం నింపే దిశ‌గా ప‌ర్య‌ట‌న సాగుతోంది. రాజ‌ధాని ప్రాంత రైతుల ఆందోళ‌నల్ని అసెంబ్లీ వేదిక‌గా నిల‌దీసేందుకు, రైతుల ఆవేద‌న‌న్ని తెలియ చెప్పేందుకు జ‌గ‌న్ ఈ ప‌ర్య‌ట‌న సాగిస్తున్నారు. ఆందోళ‌న‌తో కొట్టుమిట్టాడుతున్న రైతాంగం... వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తో మ‌మేకం అయి త‌మ ఆవేద‌న‌ను, గుండెల్లో గూడు క‌ట్టుకొన్న ఆందోళ‌న‌ల్ని పంచుకొంటున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ రైతుల‌తో జ‌గ‌న్ ముఖాముఖి నిర్వ‌హిస్తూ  వారిలో విశ్వాసం నింపుతున్నారు.
Back to Top