అరుణ్ జైట్లీతో వైఎస్ జగన్ భేటీ

న్యూఢిల్లీ:  వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీతో సమావేశమయ్యారు.  ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం తదితరన అంశాల గురించి అరుణ్ జైట్లితో చర్చించారు. వైఎస్ జగన్ వెంట వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఉన్నారు.

వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సంగతి తెలిసిందే.  పోలవరం ప్రాజెక్టును వేగంగా నిర్మించటంతో పాటు.. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను సత్వరమే అమలు చేసేలా జోక్యం చేసుకోవాలని మోదీని విన్నవించారు.

Back to Top