వైయస్ జగన్ తో ఆత్మీయ సమావేశం

హైదరాబాద్ః వివిధ జిల్లాలకు చెందిన వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు లోటస్ పాండ్ లో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ను కలుసుకున్నారు. ఆత్మీయంగా సమావేశమయ్యారు. పార్టీ వ్యవహారాలు సహా అనేక అంశాలపై చర్చించారు. వైయస్ జగన్ ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, కాకాని గోవర్థన్ రెడ్డి,  రఘురామిరెడ్డి, ఇతర నేతలు ధర్మాన కృష్ణదాస్,  ఆనం విజయకుమార్ రెడ్డి, ఆళ్ల నాని తదితరులు ఉన్నారు.


Back to Top