పార్టీ ముఖ్య నాయ‌కుల‌తో వైయ‌స్ జ‌గ‌న్ కీల‌క భేటీ

హైదరాబాద్:  హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ లోని కేంద్ర కార్యాల‌యంలో కీల‌క స‌మావేశం జ‌రుగుతోంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అద్య‌క్ష‌త‌న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు భేటీ అయ్యారు.  ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు.  రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై నేతలతో చర్చించి ఖరారు చేయనున్నారు. జూన్ 11న రాజ్యసభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇందులో అసెంబ్లీ బ‌లా బ‌లాల రీత్యా వైయ‌స్సార్సీపీకి ఒక‌టి ల‌భించ‌నుంది. దీంతో ఈ స‌మావేశంలో అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌నున్నారు. 
Back to Top