జాతీయస్థాయి నేతలతో వైఎస్ జగన్ భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి...అలా వచ్చిన బ్లాక్ మనీ సొమ్ముతో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న చంద్రబాబు దుర్మార్గపు పాలనను  వైఎస్సార్సీపీ జాతీయస్థాయిలో ఎండగడుతోంది. సేవ్ డెమోక్రసీ నినాదంతో హస్తినలో ఉద్యమిస్తోంది. కాసేపటి క్రితమే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను  వైఎస్ జగన్ బృందం ఆయన నివాసంలో కలుసుకుంది.  బాబు అవినీతిపై రూపొందించిన చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తక కాపీని అందించింది.  మరి కాసేపట్లో హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేడీయూ నేత శరద్ యాదవ్ లతో  వైఎస్ జగన్, పార్టీ నేతలు సమావేశం కానున్నారు. 


పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పరిహసిస్తూ ..ఇతర పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలకు పచ్చకండువాలు కప్పుతున్న చంద్రబాబు అరాచక రాజకీయాలను జాతీయస్థాయి నేతలకు వైఎస్ జగన్ వివరిస్తున్నారు.  చంద్రబాబు అవినీతిపై  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని వైఎస్ జగన్ విడుదల చేశారు.  ఈపుస్తక కాపీలను ఢిల్లీలో జాతీయ పార్టీ నేతలకు అందించి బాబు అక్రమ పాలన గురించి ఎలుగెత్తి చాటుతున్నారు. 

Back to Top