సాయంత్రం రైతులతో వైయ‌స్‌ జగన్‌ ఆత్మీయ సదస్సు

 
 
చిత్తూరు:  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గురువారం సాయంత్రం చంద్రగిరి నియోజకవర్గంలోని అనుప్పల్లి పంచాయతీ నెమ్మలగుంటపల్లిలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల ఆత్మీయ సదస్సులో పాల్గొంటారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. 11వ తేదీ నుంచి 16 వరకూ పార్టీ అధినేత జగన్‌ చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంటారన్నారు. 11న అనుప్పల్లి, 12న నెత్తకుప్పం, కమ్మపల్లి, రాయలచెరువు, 13న కుప్పం బాదూరు, గంగిరెడ్డిపల్లి, కమ్మకండ్రిగ, రామచంద్రాపురం గ్రామాల్లో పాదయాత్ర ఉంటుందన్నారు. 14న నడవలూరు, ఎన్నూరు, కేవీపురం, కమ్మపల్లి గ్రామాల్లో వైయ‌స్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ఉంటుందన్నారు. 16న ఉదయం రావిళ్లవారిపల్లె మీదుగా నగరి నియోజకవర్గానికి ప్రవేశిస్తుందని ఎమ్మెల్యే చెవిరెడ్డి వివరించారు.

తాజా ఫోటోలు

Back to Top