బీసీ కుటుంబాల్లో వెలుగులు నింపుతాం

  • చంద్రబాబు ప్యాక్షన్ పాలన చేస్తున్నాడు
  • జన్మభూమి కమిటీలను పెట్టి గ్రామాలను మాఫియాగా మార్చాడు
  • బాబు హయాంలో ఒక్క గొర్రెకైనా ఇన్సూరెన్స్ వచ్చిందా..?
  • బీసీలపై ప్రేమ అంటే బాబు దృష్టిలో కత్తెర్లు, ఇస్త్రీపెట్టెలు
  • ఒక్కసారి వైయస్ఆర్ సువర్ణయుగాన్ని గుర్తుకు తెచ్చుకోండి
  • ప్రతి బీసీ కుటుంబం పేదరికం నుంచి బయటపడాలని కలలుగన్నారు
  • నాన్నగారిచ్చిన ఫీజురీయింబర్స్ మెంట్ తో డాక్టర్లు,ఇంజినీర్లు, కలెక్టర్ లయ్యారు
  • ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వులు చూడడమే తమ ధ్యేయం
  • త్వరలోనే బీసీ గర్జన చేపట్టి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాం
  • మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలను అన్ని విధాల ఆదుకుంటుంది
  • బీసీలతో వైయస్ జగన్ ఆత్మీయ సమ్మేళనం
వైయస్ఆర్ జిల్లాః ఏడవ రోజు వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. మైదుకూరు నియోజకవర్గం కానగూడురులో వైయస్ జగన్ బీసీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రతి బీసీ సోదరుడి మొహంలో చిరునవ్వులు చూడడమే తన ధ్యేయమని వైయస్ జగన్ అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలను అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైయస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...

వైయస్ఆర్ సువర్ణయుగాన్నిఒక్కసారి గుర్తుకు తెచ్చుకొమ్మని అడుగుతున్నా. నాన్నగారి పాలనలో గొర్రెలు, మేకల చెవులకు కూపన్ లు కట్టేవాళ్లు. ఏ గొర్రె చనిపోయినా పూర్తిగా ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి ఉండేది. బాబు హయాంలో నాలుగేళ్లలో ఓ గొర్రెకైనా ఇన్సూరెన్స్ వచ్చిందా అని అడుగుతున్నా. పేరుకు మాత్రమే బాబుకు బీసీల మీద ప్రేమ. నాలుగు కత్తెర్లు, ఇస్త్రీపెట్టెలిచ్చేసి బీసీల మీద ప్రేమ ఇంతే అని చెబుతున్నారు. బీసీలపై ప్రేమ అంటే ఏంటో వైయస్ఆర్ చూపించారు. ప్రతి బీసీ కుటుంబం పేదరికం నుంచి బయటపడాలంటే డాక్టర్, ఇంజినీర్, కలెక్టర్ లాంటి పెద్ద చదువులు చదవాలని నాన్నగారు కలలుకన్నారు. ఫీజులెంతైనా పర్వాలేదు నేను చదివిస్తానని ఉచితంగా చదివించారు. 

ఇవాళ ఇంజినీరింగ్ ఫీజులు చూస్తే లక్ష దాటుతున్నాయి. బాహ మాత్రం రూ. 35వేలు ఇస్తున్నాడు. అది కూడ సంవత్సరం తర్వాత వస్తే గొప్పన్నట్టచుగా ఉంది. ఫీజులిమ్మంటే ఇళ్లు అమ్ముకుంటారులే అని బాబు చులకనగా మాట్లాడుతున్నాడు. ఈ పరిస్థితిని మార్చాలి. పేదరికం పోవాలంటే ప్రతి బీసీ కుటుంబం పెద్ద చదువులు చదువుకోవాలి. ఎంతైనా సరే ఇంజినీరింగ్, డాక్టర్, కలెక్టర్ లాంటి పెద్ద చదువులు నేను చదివిస్తాను. అంతేకాదు,  చదువుకునేటప్పుడు హాస్టల్ లో ఉండేందుకు పేద పిల్లలు అవస్థలు పడుతున్నారు. ఆ పరిస్థితి నుంచి దూరం చేసేందుకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు 20వేలు అదనంగా ఇస్తాం. బాబు హయాంలో నాలుగేళ్లలో మీ కుటుంబానికి ఒక్క రూపాయైనా మేలు జరిగిందా అని అడుగుతున్నా. 

పనిచేసుకుంటే తప్ప కడుపు నిండని దుస్థితి పేదలది.  మనందరి ప్రభుత్వం వచ్చాక మనం ప్రవేశపెట్టే పథకం అమ్మఒడి. మీ పిల్లలను బడులకు పంపించండి. ప్రతి తల్లి అకౌంట్ కు సంవత్సరానికి 15వేలు మేము వేస్తాం. ప్రతి కుటుంబానికి 15వేలు అందుతుంది. ఇది ఒక్కటే కాదు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలు, మైనారిటీ సోదరులకు పెన్షన్ 45 ఏళ్లకే ఇవ్వబోతున్నాం.   ప్రతి పేదవాడి మొఖంలో చిరునవ్వులు చూడడమే తన లక్ష్యం. ఇవిగాక మీకు ఇంకా చేయాల్సినవేమైనా ఉంటే దొరిపొడవునా చెప్పండి. మరో 2, 3రోజుల్లో బీసీ కమిటీ డిక్లేర్ చేయబోతున్నా. 

పాదయాత్ర జరుగుతున్న సందర్భంగా బీసీ కమిటీ ప్రతి నియోజకవర్గం తిరిగుతుంది. బీసీలతో ఏకమయ్యే కార్యక్రమం చేసి సలహాలు, సూచనలు తీసుకుంటుంది.  పాదయాత్ర అయిపోయే సమయానికి బీసీ గర్జన జరుపుతాం. బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాం. ప్రతి కులం వారితో మాట్లాడే కార్యక్రమం చేస్తాం. వారికి ఏం చేయబోతున్నామో చెప్తాం. నా మనసులో ఇవాళ్టికి ప్రధానంగా మూడు కార్యక్రమాలున్నాయి. పూర్తిగా ఫీజురీయింబర్స్ మెంట్ చేయడంతో పాటు అదనంగా మరో రూ.20వేలు ఇవ్వడం, అమ్మఒడి పథకం, 45 ఏళ్లకే పింఛన్.  ఇంకా ఏమైనా ఉంటే దారిపొడవునా సూచనలు, సలహాలివ్వండి. తప్పకుండా తీసుకుంటాను. 

చంద్రబాబు ఫ్యాక్షన్ పాలన చేస్తున్నాడు. గ్రామాలను మాఫీయాగా తయారు చేశాడు.  జన్మభూమి కమిటీలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అన్నీ కట్ చేస్తున్నారు. కరెంట్ బిల్లులు కూడ ఎక్కువ వేసి పంపుతున్నారు. బాబు పాలనలో  వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు రేషన్ కూడ ఇప్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంత దారుణంగా బాబు జన్మభూమి కమిటీలను వాడుకొని భ్రష్టుపట్టిస్తున్నాడు. మనం వచ్చాక గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తాం. ఇదే గ్రామానికి చెందిన 10మందికి ప్రభుత్వమే ఉద్యోగం ఇస్తుంది. పెన్షన్, రేషన్, ఇళ్లు, ఆరోగ్యశ్రీ ఏదైనా 72 గంటల్లో మీ చేతికిచ్చే కార్యక్రమం చేస్తుంది. కుల,మత, ప్రాంతాలకతీతంగా...పార్టీలకతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయి.  ఏ ఎమ్మెల్యే, నాయకుడు, మంత్రి దగ్గరకు పోవాల్సిన పనిలేదని వైయస్ జగన్ ప్రజలకు భరోసా కల్పించారు. 

తాజా వీడియోలు

Back to Top