బెల్లంపై ఆంక్షల వెనుక ప్రభుత్వ పెద్దల స్వార్థం

 


చిత్తూరు: చెరకు రైతుల కష్టాలు చూస్తుంటే బాధ కలుగుతోందని , బెల్లం తయారీపై అనవసర ఆంక్షల వెనుక ప్రభుత్వ పెద్దల స్వార్థం కనిపిస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకార చక్కెర ఫ్యాక్టరీలపై ప్రభుత్వ తీరును వైయస్‌ జగన్‌ ఎండగట్టారు. ప్రభుత్వం అనవసర ఆంక్షలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని, ప్రైవేట్‌ ఫ్యాక్టరీల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడాల్సిన దుస్థితి నెలకొందని, కాపాడాల్సిన ప్రభుత్వమే రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడటం సిగ్గు చేటు అన్నారు. మనందరి ప్రభుత్వం వచ్చాక బెల్లం రైతులకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.

సమస్యల వెల్లువ: 
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలం సంతబైలు వద్ద చెరకు రైతులు, పాల రైతులు ప్రతిపక్ష నేతను కలిశారు. అలాగే పింఛన్లు రాలేదంటూ అవ్వతాత, గిట్టుబాటు ధర లేదంటూ అన్నదాతలు, రుణాలు మాఫీ కాలేదని అక్కా చెల్లెమ్మలు ఇలా అన్ని వర్గాల ప్రజలు వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకుంటున్నారు. నల్లబెల్లంకు ధర లేదని, కనీసం రూ.20 వేలు ఉంటే గిట్టుతుందని, ఇప్పుడు రూ.10 వేలకు మించి రావడం లేదని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. పాలు, బెల్లంకు కనీస ధర లేదు.పాలకు లీటర్‌ రూ.17, 18కు మించి ఇవ్వడం లేదన్నా అని మొరపెట్టుకున్నారు. నీళ్లు బిల్లే ఎక్కువగా ఉందని, పాల బిల్లులు రావడం లేదన్నారు. కరువు పనులు చేసి రెండు నెలలు పూరై్తనా ఇంతవరకు డబ్బులు ఇవ్వడం లేదని వాపోయారు. డ్వాక్రా రుణాలపై ఒక్కొక్కరికి రూ.7 వేల వడ్డీ వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. అడుగడుగునా వైయస్‌ జగన్‌కు జననీరాజనం పలుకుతున్నారు.   
Back to Top