రాష్ట్రపతితో వైయస్ జగన్ భేటీ

హైదరాబాద్: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రపతిని కలిశారు.  చంద్రబాబు నాయుడు  ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినందుకు నిరసనగా చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా... వైయస్‌ జగన్‌ నేతృత్వంలో పార్టీ ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ ముఖర్జీతో సమావేశమైంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న చంద్రబాబుపై వైయస్ జగన్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. వైయస్‌ జగన్‌ వెంట ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఎమ్మెల్యే కోన రఘుపతి తదితరులు ఉన్నారు . 
Back to Top