వైయస్‌ జగన్‌తో ఎమ్మెల్సీల భేటీ

ఏపీ అసెంబ్లీ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో నూతనంగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్సీలు ఆళ్లనాని, గంగుల ప్రభాకర్‌రెడ్డి, వెన్నపూస గోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. గురువారం అసెంబ్లీలోని వైయస్‌ఆర్‌సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ఎమ్మెల్సీలకు వైయస్‌ జగన్‌ సూచించారు. ఈ రోజు పామ్రరు నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ పర్యటించనున్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఐదుగురు రైతుల కుటుంబాలకు వైయస్‌ జగన్‌ పరామర్శించనున్నారు.

Back to Top