తూర్పు గోదావరి జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష

సంస్థాగతంగా పార్టీని పటిష్ట
పరిచే చర్యల్లో భాగంగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఒక్కో
జిల్లా నేతలతో సమావేశమై అక్కడ పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.ఇందులో భాగంగా
తూర్పు గోదావరి జిల్లా నాయకులతో ఆయన భేటీ అయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షులు
జ్యోతుల నెహ్రూ, జిల్లా వ్యవహారాల పరిశీలకులు ధర్మాన ప్రసాద్ రావు, పార్లమెంటు
నియోజక వర్గాల ఇన్ ఛార్జ్ లు, అసెంబ్లీ నియోజక వర్గాల ఇన్ చార్జ్ లు ,ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు. సమావేశం వివరాల్ని పరిశీలకులు ధర్మాన ప్రసాద్ రావు
మీడియకు వెల్లడించారు.

ఈ సమావేశంలో ప్రధానంగా రెండు
అంశాల మీద ద్రష్టి పెట్టినట్లు ధర్మాన వివరించారు. తూర్పు గోదావరి జిల్లాలో వివిధ
ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలు, ప్రజలకు
కలుగుతున్న ఇబ్బందులు, పార్టీ పరంగా చేయాల్సిన పోరాటాల మీద నియోజక వర్గాల ఇన్ చార్జ్
లు అధ్యక్షులు జగన్ ద్రష్టికి తీసుకొని వచ్చారు. పార్టీ పరంగా తీసుకోవలసిన చర్యలు,
సంస్థాగత పటిష్టత లో భాగంగా తీసుకోవలసిన నిర్ణయాల్ని చర్చించారు. నాయకులతో వివిధ
అంశాల్ని చర్చించిన అధ్యక్షులు జగన్ నాయకులకు దిశ నిర్దేశం చేశారు. ప్రజల్లో
నిరంతరం ఉంటూ ప్రజా ఉద్యమాల్ని నిర్మించాలని కర్తవ్య బోధ చేశారు.

స్థానిక సంస్థల్ని చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా నిర్వీర్యం చేయటంపై
చర్చించారు. గ్రామ పంచాయతీల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులు పనిచేస్తున్న చోట, నిధుల్ని
విడుదల చేయకుండా నిర్లక్య ధోరణి అవలంబించటంపై చర్చించారు. ఎక్కడికక్కడ జన్మభూమి
కమిటీల పేరుతో తెలుగుదేశం నాయకులు చేస్తున్న అరాచకాల్ని పార్టీ నాయకులు
లేవనెత్తారు. చట్ట బద్దమైన వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్న తీరుపై చర్చించటం
జరిగింది.

అటు,ప్రభుత్వ ఇసుక విధానంపై నేతలు మాట్లాడారు. గడచిన 18 నెలల్లో 6,7 సార్లు
క్యాబినెట్ లో ఇసుక గురించి మాట్లాడారు. కానీ ఇప్పటిదాకా స్పష్టత తీసుకోలేదు.
ఇసుకను అక్రమార్కులుమాత్ర తవ్వేసుకొంటున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలకు ఇసుక దొరకటం
లేదు. ప్రభుత్వ పరంగా కొత్తగా ఇళ్ల నిర్మాణం అసలు జరగటం లేదు. ఒక్కటంటే ఒక్కటి
కొత్త ఇల్లు కట్టడం లేదు.

లక్షలాది ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తున్నారు. కానీ, రైతులకు కనీస మద్దతు ధర
దొరికే పరిస్థితి లేనే లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే మార్గం
కనిపించటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం  దీనిపై
చొరవ చూపటం లేదు. రైతాంగం అంతా మద్దతు ధర దొరకుతుందో లేదో అని ఆందోళన గా ఉంది.

మొత్తం మీద పటిష్టంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టడం, పార్టీని సంస్థాగతంగా
నిర్మాణం చేయటంతో పాటు నాయకులు చేపట్టాల్సిన కార్యక్రమాల మీద అధ్యక్షులు వైఎస్
జగన్ దిశానిర్దేశనం చేశారు. ఈ నెలాఖరున కాకినాడలో యువ భేరీ నిర్వహించాలని సమావేశంలో
నిర్ణయించారు. 

Back to Top