బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తాం


– బీసీ కమిటీ రాష్ట్రమంతటా పర్యటిస్తుంది
– పాదయాత్రలోపు బీసీ సమస్యలపై నివేదిక 
– బీసీ గర్జన సభ నిర్వహిస్తాం
– కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గోరంట్ల మండలంలో సభ 
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గోరంట్ల మండలంలో బీసీ సంఘాలతో వైయస్‌ జగన్‌ ముఖాముఖి.. 

వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే ప్రజలకు అండగా ఉంటామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన ఆదివారం  కోడుమూరు నియోజకవర్గం గోరంట్లలో బీసీ సంఘం ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ... ‘బీసీల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం ఆనందంగా ఉంది.  కులాలను సాంఘిక బహిష్కరణ చేస్తున్నారని తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎన్నిలకు ముందు బీసీలకు సబ్‌ప్లాన్‌ అని చెప్పారు.  బీసీ సబ్‌ ప్లాన్‌ కింద ఏడాదికి పదివేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన నాలుగేళ్లలో 40 వేల కోట్లకు గాను కేవలం 9 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. అంటే 20 శాతం కూడా ఇవ్వలేదు. 2014–15 సంవత్సరంలో 2242 కోట్లు, 2015–16 2573 కోట్లు, 2016–17కి గాను 4500 కోట్లు మాత్రమే  ఖర్చు చేశారని  వివరించారు. వచ్చే ఎన్నికల్లో కి కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి బోయ వర్గానికి   ఒకరికి ఎంపీ సీటు కేటాయిస్తాామని ప్రకటించారు.  పాదయాత్ర ముగిసే లోపు పార్టీ తరఫున బీసీ కమిటీలు ప్రతి జిల్లాలో కనీసం నాలుగు సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు.. బీసీల సమస్యలు తెలుసుకుని నివేదిక రూపొందిస్తారన్నారు. బీసీ గర్జన  సభ ను నిర్వహిస్తామని ,  బీసీ డిక్లరేషన్‌ చేస్తామని వైయస్ జగన్ అన్నారు. 
జిల్లాలో తిరిగే కమిటీల దృష్టికి  సమస్యలను తీసుకుని వస్తే, అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కేఈ కృష్ణమూర్తి ఊరిలో అవసరమైన ఒక బ్రిడ్జి  కూడా నిర్మించలేకపోయారు. నేను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బ్రిడ్జి శంకుస్థాపనకు టెంకాయ కొడతామన్నారు.ఆ తర్వాత మరో రెండేళ్లలో బ్రిడ్జిని పూర్తిచేస్తాం. ఇంకా ఆయనేమన్నారంటే..

ఎన్నికలకు ముందు హామీలిచ్చి ఎన్నికలయ్యాక మోసం చేయడం ధర్మమేనా? అంటూ చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు.  కురుమలను బీసీ బి నుంచి ఎస్సీల్లో చేర్చడానికి చర్యలు తీసుకుంటామని చెప్పిన మాటను నిలబెట్టుకోకుండా మోసం చేశారన్నారు. వాల్మీకి బోయలను ఎస్టీలను గుర్తించడానికి అవసరమైన చర్యలు, 
రజకులను ఎస్సీలను గుర్తించడానికి చర్యలు. మేనిఫెస్టోలో ఇలా ప్రతి కులానికి హామీ ఇచ్చిన వివరాలను జగన్ ఈసందర్భంగా ప్రస్తావించారు. బాబుఅందర్నీ మోసం చేశారు. ఎన్నికలప్పుడు హామీలిచ్చి మోసం చేయడం ధర్మమేనా.?
 ఇవేకాకుండా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నీ గుర్తుకు తెచ్చుకోండన్నారు ప్రతిపక్ష నేత వైయస్ జగన్. కరెంటు బిల్లలు తగ్గిస్తానని చెప్పిన విషయం గుర్తుంది కదా. ఎన్నికలకు ముందు 50 రూపాయలొచ్చే కరెంటు బిల్లులు 500లకు పెరిగిపోయాయి. టీడీపీ పాలన రాకముందు రేషన్‌ షాపుల్లో బియ్యంతోపాటు, చింతపండు, చక్కెర, పామాయిల్, కందిపప్పు, కిరోసిన్, గోధుమ పిండి వంటి తొమ్మిది రకాల సరుకులు దొరికేవి. నాలుగేళ్లుగా చంద్రబాబు పాలన చూశారు. బియ్యం తప్ప ఇంకేమైనా ఇస్తున్నారా. ఆ ఇచ్చేది కూడా వేలిముద్రలు పడటం లేదని కనీసం ఇద్దరికైనా ఎగరగొడతారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం, ఇళ్లు కట్టిస్తామన్నారు. నాలుగేళ్ల తర్వాత అడుగుతున్నా ఒక్క ఇళ్లయినా కట్టించారా? అంటూ ప్రశ్నించారు. 

 ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. జాబు ఇవ్వకపోతే ఒక్కొక్కరికీ రెండు వేలిస్తామన్నాడు. ఇప్పటికే 45 నెలలైంది బాబు ముఖ్యమంత్రి అయ్యి. అంటే ప్రతి ఇంటికీ 90 వేలు బాకీ ఉన్నాడు. బ్యాంకుల్లో ఉన్న బంగారం బయటకు రావాలంటే బాబు రావాలన్నాడు. వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానన్నాడు. ఇప్పుడు అడుగుతున్నా బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం బయటకొచ్చిందా... రుణమాఫీ వడ్డీలకైనా సరిపోయిందా..డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా. చంద్రబాబు లాంటి వ్యక్తులు ఇలాగే కొనసాగితే విశ్వసనీయత అనే పదానికి అర్థం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. 
ప్రజలను మోసం చేసిన ఇలాంటి వ్యక్తులను ఇంటికి పంపే రోజులు రావాలి. చంద్రబాబును ఇలాగే వదిలేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రతి ఇంటికీ కారు, కేజీ బంగారం ఇస్తామని నిర్లజ్జగా చెబుతాడు. 

బాబు బిసీల ప్రేమ ఇదీ!

చంద్రబాబుకు బీసీల మీద ప్రేమంటే ఇస్త్రీ పెట్టెలు పంచడం, కత్తెర్లు ఇవ్వడం... కానీ మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో ప్రతి బీసీ  కుటుంబానికి లబ్ది చేకూరేలా పథకాలను అమలు చేశారు. ఎంతవరకు  చదువుకున్నా ఫీజులు వంద శాతం కట్టడానికి ముందుకొచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేసి ఎంతోమందిని డాక్టర్లు, ఇంజినీర్లుగా తీర్చిదిద్దారు. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 30వేలుండే ఫీజులను 70 వేలకు పెంచేసి వారిని చదువులకు దూరం చేశాడు. ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని.. స్కాలర్‌షిప్‌లు రావడం లేదని నన్ను పాదయాత్రలో కలిసిన విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. 
మనం అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తీసుకొస్తాం. ప్రతి తల్లికీ ఒకే మాట చెబుతున్నాం. మీ పిల్లలను బడులకు పంపించండి. బడికి పంపించినందుకే ఏడాదికి 15 వేలిస్తాం. మీ పిల్లలు బాగా చదివి ఇంజినీరింగ్, డాక్టర్‌ చదివి వృద్ధిలోకి రావాలి. కాలేజీ చదువులకు కూడా మేం భరోసా ఇస్తాం. కాలేజీ ఫీజులు ఎంతన్నా ఉండనీ అంత నేనే భరిస్తా. ఫీజులకే  కాదు.. వారు ఉండటానికి, తినడానికి అయ్యే ఖర్చు ఏడాదికి 20 వేలు మేమే ఇస్తాం. మీ కుటుంబాలన్నీ బాగు పడాలి. మీ పిల్లల భవిష్యత్తు బంగారు మయం కావాలి. 

దేవుడి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడితే హామీలన్నీ నెరవేర్చి తీరుతాం. 
ధర్మవరం వెళ్లినప్పడు చేనేతల దీక్షలో పాల్గొన్నా. వారి సమస్యలు వింటే బాధ కలిగింది. అందుకే పింఛను వెయ్యి నుంచి రెండు వేలకు పెంచుతున్నా. పింఛను వయసు కూడా 45 సంవత్సరాలకే తగ్గిస్తున్నాం. మీరిప్పుడు కరెంటు బిల్లులు కట్టలేక పడే ఇబ్బందులు తెలుసు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు అమలు చేస్తాం. ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు కట్టించి ఇస్తాం. పొదుపు సంఘాల మహిళలకు నాలుగు దశల్లో ఎన్ని రుణాలున్నా నాలుగు విడతలుగా మాఫీ చేస్తాం. సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే బాధ్యత మేం చూసుకుంటాం. బ్యాంకులకు వెన్నుదన్నుగా ఉండి పావలా వడ్డీ రుణాలు వచ్చేలా చూస్తాం. ఎన్నికల నాటికి బ్యాంకు దగ్గరికే వెళ్లి ఎన్ని రుణాలున్నాయో స్లిప్‌ తెచ్చుకోండి. మీ రుణాలన్నీ నాలుగు విడతల్లో మాఫీ చేస్తాం. మనం ప్రవేశపెట్టే పథకాలన్నీ పేదవారిని దృష్టిలో పెట్టుకుని చేసినవే. పాదయాత్ర చేస్తుంటే కురుమ సోదరులు నా వద్దకు వచ్చి కలుస్తున్నారు. గతంలో నాన్నగారి హయాంలో అందరికీ ఇన్సూరెన్సులు వచ్చేవని చెప్పారు. ఇప్పుడు మాత్రం రావడం లేదని బాధ పడుతున్నారు. గతంలో 108, 104లకు ఫోన్‌ చేయగానే అంబులెన్సులు వచ్చేవి. ఆ విధంగానే గొర్రెలు, ఆవులు, ఎనుముల  రక్షణ కోసం 102 అమల్లోకి తీసుకొస్తాం. మీ ఆశీస్సులతో అ«ధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలే కాదు.. ఇవ్వని హామీలు నెరవేర్చి తీరుతాం. 

తాజా వీడియోలు

Back to Top