అలుపెరగని పోరాట యోధుడు వైయస్‌ జగన్‌

అలుపెరగని పోరాట యోధుడు వైయస్‌ జగన్‌
వైయస్‌ఆర్‌ సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి

అనంతపురం: ప్రజల కోసం పాదయాత్ర చేస్తూ.. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా సాధనకు అలుపెరగని పోరాటాలు చేస్తున్న నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన వందల కొద్ది వాగ్ధానాల్లో ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేదని ఆమె మండిపడ్డారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని కొత్త కొత్త హామీలతో మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నాడని, ఈసారి ఎవరూ టీడీపీని నమ్మే పరిస్థితిల్లో లేరన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ముగ్గురిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. వారు యువత, శ్రామికులు, అన్నం పెట్టే రైతులు. ముగ్గురిని చంద్రబాబు మోసం చేశారు. కానీ వైయస్‌ జగన్‌ ఈ ముగ్గురి పేరుమీదనే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ అని పార్టీ పేరు పెట్టారన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు.. కానీ ఇంత వరకు ఏ ఒక్కరికీ భృతి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు.
Back to Top