ఈనెల 26 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష..!

ప్రత్యేక హోదాపై సమరశంఖం పూరించిన ప్రతిపక్ష నేత..!

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సాధన కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమరశంఖం పూరించారు. ఈనెల 26న గుంటూరు వేదికగా నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించ‌నున్నారు.   హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో  రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతలతో జగన్ సమావేశమయ్యారు. పార్టీ నేతలతో  చర్చించి దీక్ష తేదీని ఖరారు చేశారు. పార్టీ కమిటీల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని ఈసందర్భంగా నేతలకు జగన్ ఆదేశాలు జారీ చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకహోదాపై తీర్మానం చేసి ఆమోదించిన సంగతి తెలిసింది. ఐతే, ఆతీర్మానానికి బలం రావాలంటే చంద్రబాబు కేంద్రంలో మంత్రులను ఉపసంహరించుకోవాలని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలోనే  చంద్రబాబుకు ఈనెల 15వరకు డెడ్ లైన్ విధించారు. ఆలోగా హోదా రాకుంటే 15 తర్వాత గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని సర్కార్ ను హెచ్చరించారు. ఐతే, వినాయకచవితి ఉండడంతో పార్టీ నేతల సూచన మేరకు వైఎస్ జగన్ దీక్షను వాయిదా వేసుకున్నారు. ఇవాళ పార్టీనేతలతో సమావేశమై దీక్ష తేదీని డిక్లేర్ చేశారు. 
Back to Top