వైఎస్ జగన్ హెల్త్ బులెటిన్..

గుంటూరుః
 ప్రత్యేకహోదా సాధన కోసం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ జగన్
ఆరోగ్యం నాల్గవ రోజు కాస్త క్షీణించింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రి
వైద్యులు డా. ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో రాత్రి 9 గంటలకు జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుత హెల్త్ బులెటిన్: బీపీ 100/60, షుగర్ లెవల్స్ 77, పల్స్ రేట్ 74.  

మధ్యాహ్నం జగన్ కు వైద్య పరీక్షలు
నిర్వహించారు. వైఎస్ జగన్ బాగా నీరసంగా కనిపిస్తున్నారని వైద్యులు
తెలిపారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల
చేశారు. బీపీ 110/80, షుగర్ లెవల్స్ 82 ఎంజీ, పల్స్ రేటు 70 ఉన్నట్లు
వైద్యులు ధృవీకరించారు. 

ఉదయం గుంటూరు
ప్రభుత్వాసుపత్రి వైద్యులు డా. క్రీస్తుదాస్ జగన్ కు వైద్య పరీక్షలు
నిర్వహించారు. అప్పుడు బీపీ 129/90, షుగర్ లెవల్స్ 87 ఎంజీ, పల్స్ 66 ఉంది.
దీక్ష కారణంగా వైఎస్ జగన్ బాగా నీరసించిపోయారని, పల్స్ రేటు గంట గంటకు
పడిపోతుందని డాక్టర్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం
ప్రత్యేకహోదాని సాధించేందుకు వైఎస్ జగన్ మొక్కవోని దీక్షతో పోరాటం
కొనసాగిస్తున్నారు. ఉద్యమం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. 

Back to Top