వైయ‌స్ జ‌గ‌న్‌కు రాఖీ క‌ట్టిన మ‌హిళా నేత‌లు

విశాఖ‌:  సీఎం చంద్రబాబు నాయుడి దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కష్టపడుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ... వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ... వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు,  ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో ఆదివారం రాఖి పండ‌గ‌ను పుర‌స్క‌రించుకొని వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా నేత‌లు జ‌న‌నేత‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌రి ఎమ్మెల్యే రోజా, పార్టీ నాయ‌కురాళ్లు ప‌ద్మ‌జా, క‌ణ్యాణి త‌దిత‌రులు వైయ‌స్ జ‌గ‌న్‌కు రాఖీ కట్టి ఆనందించారు. వారికి వైయ‌స్ జగన్ మిఠాయి తినిపించి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, పిల్లలు జగన్‌కు రాఖీ కట్టారు. 
Back to Top