వైయస్ జగన్ కాకినాడ పర్యటన వాయిదా

హైదరాబాద్‌ : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కాకినాడ పర్యటన వాయిదా పడింది. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నఅనంతరం ఆయన  స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో వైయస్‌ జగన్‌ కాకినాడ పర్యటన వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్‌ ప్రకారం ఆయన ఇవాళ (శనివారం) కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అయితే అస్వస్థత కారణంగా  వైయస్‌ జగన్‌ పర్యటన పోస్ట్‌పోన్‌ అయింది. వైయస్ జగన్ జలుగు, జ్వరంతో బాధపడుతున్నారు. 

Back to Top