వైయస్‌ జగన్‌ కాకినాడ షెడ్యూల్‌ ఖరారు

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ నెల 26న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పర్యటన షెడ్యూల్‌ ఖారరైంది. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో వైయస్‌ జగన్‌ పాల్గొంటారు. కాకినాడ జగన్నాథపురం ప్రాంతంలోని చంద్రిక థియేటర్‌ నుంచి వైయస్‌ జగన్‌ ప్రచారం ప్రారంభమవుతుందని వైయస్‌ఆర్‌సీపీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ తలశీల రఘురామ్, అధికార ప్రతినిధి పార్థసారధి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వైయస్‌ జగన్‌ ఆయా డివిజన్లలో పర్యటించి వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. వైయస్‌ జగన్‌ పర్యటనను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని వారు కోరారు.
Back to Top