ఆదివారం కాకినాడలో వైయస్‌ జగన్‌ ప్రచారం

కాకినాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. శనివారం పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డితో కలిసి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. జననేత ఈ నెల 27న కాకినాడకు వస్తున్నారని,  ఎన్నికల నిబంధనల మేరకు సాయంత్రం 4 గంటలకు ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. ఉదయం 11 గంటలకు ఒక కార్యక్రమం, 2 గంటలకు మరో సభలో వైయస్‌ జగన్‌ పాల్గొంటారని చెవిరెడ్డి తెలిపారు. వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలకాలని, వైయస్‌ఆర్‌సీపీని గెలిపించాలని కాకినాడ ప్రజలు ఉత్సాహంతో ఉన్నారన్నారు.  గతంలో చంద్రబాబుకు ఓటు వేసి తప్పు చేశామని, ఇకపై వైయస్‌ జగన్‌ను వీడబోమంటూ కాకినాడ ప్రజలు పేర్కొంటున్నారని, ఇదే ఉత్సాహంతో ప్రచారంలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ముందుకు వెళ్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ ప్రచార కార్యక్రమంలో కాకినాడ నగర ప్రజలు స్వచ్ఛందంగా హాజరై జయప్రదం చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Back to Top