వైయస్‌ జగన్‌ జనతా క్యాంటీన్‌ ప్రారంభంప్రజా సంక్షేమానికి వైయస్‌ఆర్‌ సీపీ కట్టుబడి ఉంది
అన్నా క్యాంటీన్‌లు పెడతామని చంద్రబాబు మోసం 
హిందూపురం వైయస్‌ఆర్‌ సీపీ సమన్వయకర్త నవీన్‌ నిశ్చల్‌

అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని హిందూపురం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త నవీన్‌ నిశ్చల్‌ అన్నారు. చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తామని ఆ విషయాన్ని విస్మరించిందని మండిపడ్డారు. నవీన్‌ నిశ్చల్‌ ఆధ్వర్యంలో హిందూపురంలో వైయస్‌ జగన్‌ జనతా క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి డాక్టర్‌ సాయిప్రసాద్‌ ట్రస్టు ఆర్థిక సహాయంతో క్యాంటీన్‌లను నిర్వహించడం జరుగుతుందన్నారు. పేదలకు తక్కువ ధరకు టిఫిన్, భోజనం అందజేయాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు చిన్న మార్కెట్‌ వద్ద, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద క్యాంటీన్‌ అందుబాటులో ఉంటుందన్నారు. రూ. 9కే భోజనం అందిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో లేపాక్షి, హిందూపూర్, చిల్మతూరు మండలాల్లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. గతంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన నియోజకవర్గంలో రాజన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే..
Back to Top