వైయస్ జగన్ జలదీక్ష@3వరోజు

కర్నూలు: తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లను ప్రతిఘటించలేని, ప్రశ్నించలేని చంద్రబాబు నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన జలదీక్ష మూడవ రోజుకు చేరుకుంది. జననేత చేపట్టిన నిరాహార దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా వెల్లువలా మద్దతు లభిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైయస్ జగన్ కు సంఘీభావం తెలుపుతున్నారు. అదేవిధంగా పార్టీశ్రేణులు వైయస్ జగన్ జలదీక్షకు మద్దతుగా రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. ఏపీకి జరుగుతున్న జల అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు వైయస్ జగన్‌ తన పోరాటం కొనసాగిస్తున్నారు.

తాజా ఫోటోలు

Back to Top