ఆటా స‌భ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ కు ఆహ్వానం

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ‘ఆటా’ మహాసభల్లో పాల్గొనడానికి అమెరికాకు రావాల్సిందిగా అక్కడ నివసించే తెలుగువారు ఆహ్వానించారు. ‘ఆటా’ ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎ.సి.కరుణాకర్‌రెడ్డి, కోఆర్డినేటర్ దగ్గుమాటి కోటిరెడ్డి శనివారం ఉదయం జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకుని ఈ మేరకు ఆహ్వానం అందజేశారు. ‘ఆటా’ మహాసభలు జూలై 1, 2,3 తేదీల్లో చికాగోలో జరుగుతాయని వారు జగన్‌కు వివరించారు. జగన్ ఈ ఆహ్వానాన్ని మన్నిస్తూ పార్టీ తరపున ఒక ప్రతినిధి బృందాన్ని సభలకు పంపుతామని చెప్పినట్లు ‘ఆటా’ ప్రతినిధులు తెలిపారు. ఆహ్వానం అందిస్తున్న సమయంలో పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు.
Back to Top