45 ఏళ్ల‌కే పింఛ‌న్‌



- బుడంపాడులో ప్రజలతో మమేకం  
గుంటూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే 45 ఏళ్ల‌కే పింఛ‌న్ మంజూరు చేస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా బుధ‌వారం గుంటూరు నగరంలోని కింగ్‌ హోటల్‌ సెంటర్‌ శివారు నుంచి ప్రజాసంకల్పయాత్ర 128వ రోజును వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అక్కడి నుంచి బుడంపాడు చేరుకుని ప్రజలతో మమేక‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల వారు పనులకు వెళ్తేనే కడుపు నిండుతుంది.. ఆరోగ్యం బాగోలేక ఇంటిపట్టున ఉంటే బతకలేని పరిస్థితి.. కాయ కష్టం చేయడంతో 40–50 ఏళ్ల మధ్యే కీళ్ల నొప్పులు మొదలవుతాయి.. ఒక్క ఏడాది ఓపిక పడితే వచ్చేది మన ప్రభుత్వమే.. ఆ తర్వాత 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల(బడుగు, బలహీన వర్గాలు)లోని పేదలకు పింఛన్లు ఇస్తాం.. అదీ రూ.వెయ్యి కాకుండా రూ.2 వేలు ఇస్తాం’’ అని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే స్థానికుల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకొని వారికి భ‌రోసా క‌ల్పించారు. వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ప్రజాసంకల్పయాత్రలో దారి పొడవునా ప్రజలు వైయ‌స్‌ జగన్‌తో తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. తమను ఆదుకుని భవిష్యత్‌పై భరోసా ఇవ్వాలని కోరుతున్నారు.

తాజా వీడియోలు

Back to Top