ప్రజలతో వైయస్ జగన్ మమేకమవుతారు

పెదపూడి (అనపర్తి): రాష్ట్రంలో చరిత్ర పునరావృతం కానుందని, వైయస్సార్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్ మోహన్‌రెడ్డి సారథ్యంలో రాజన్న రాజ్యం వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్‌ తెలిపారు. రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి నియమితులైన ఆయన అనపర్తిలో పార్టీ నియోజక కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోహన్‌ను సూర్యనారాయణరెడ్డితో పాటు పార్టీ నాయకులు ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మోహన్‌ మాట్లాడుతూ.... దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో వై.యస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఒకరన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆయన పాదయాత్ర నిర్వహిస్తారని, ప్రజలతో మమేకమవుతారని చెప్పారు.  ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి నీరు చెట్టు పనులలో టీడీపీ నాయకులు పాల్పడిన అక్రమాలను  భాగస్వామ్య పార్టీ బిజేపీ  కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిందన్నారు.  దానిపై కేంద్ర ప్రభుత్వ విజిలెన్స్‌ విచారణ జరుపుతుందనే విషయం మరిచిన టీడీపీ నాయకులు వైయస్సార్‌సీపీపై నిందలు మోపడం తగదన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రేవంత్‌ రెడ్డి యనమల రామకృష్ణుడుపై రూ.2వేల కోట్లకు సంబంధించిన కాంట్రాక్ట్‌ ఆరోపణలు చేశారని దీనిపై యనమల నోరు మెదపకుండా ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. రెవంత్‌ రెడ్డి ఆరోపణలపై యనమల రామకృష్ణుడు వివరణ ఇవ్వాలని మోహన్‌ డిమాండ్‌ చేశారు. ఆర్థిక మంత్రిగా ఉన్న యనమలపై వచ్చిన ఆరోపణలు నిరుపించుకోవాలని లేకపోతే ఆయన మంత్రి వర్గంలో కొనసాగడానికి కూడా అనర్హుడని మోహన్‌ తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top